పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


గీ॥ నక్బరును శూరధనరావు నాదరించి
   కాశికా మండల మొసంగి గారవించెఁ
   గోట వెలికి రాఁదలఁపఁ గవాటసీమ
   నతనిఁ దాఁకె శమంతకుం డతిరయమున. 197
   
మ॥ "పురముల్ పోయిన రాజ్యముల్ చెడిన నెప్డున్ మాకు రాణాయె సు
     స్థిరదై వంబగు నట్టి స్వామి పదభక్తిన్ మాని మోగల్ ధరే
     శ్వరు పాదంబులు గొల్చె శూరధనుడున్ భాగ్యమ్ము నాసించి యో
     హరవంశాగ్రణులార యీయధము దుర్వ్యాపారముల్ మెత్తురే " 198
     
మ॥ అని తానున్ దను గొల్చుచున్ని హరవంశ్యశ్రేష్ఠులౌ సద్భటుల్
     చని యొక్కుమ్మడి వారలన్ దగిలి యాస్వాతంత్య్ర యుద్ధంబునన్
     దనువుల్ వీడుచు నిత్వనాకసుఖ మొందన్ బోయి రాదేశ భ
     క్తిని లోకంబులు మెచ్చి వారియశమున్ గీర్తించె వేనోళులన్ 199
     
గీ॥ రామచంద్రుఁడు రీవామహా మహీంద్రుఁ
    డలఘు కాలంజరీ దుర్గ మప్పగించె
    బాజబహదూ రొసంగె మాళ్వము సహస్ర
    వాజి పతులౌచుఁ గొలిచి రక్బరును వారు. 200
    
గీ॥ జోధబాయి మార్వార్మహీశుని తనూజ
    గనె జహంగీరు తక్కిన కాంతలందు
    నక్బరు 'మురాదు' దనియాలుననెడు సుతులఁ
    బుత్రికామణు లొక్క రిర్వురను బడసె. 201
    
-: అక్బరు సార్వభౌముఁడు ఘూర్జర దేశము జయించుట. :-

మ॥ జనసమ్మర్దము మూర్ఖరంబు 'ముజఫర్ షా " యన్న భూమీశుఁ డా
    ఫ్గనుఁడు బాలనసేయఁగా నచటి కక్బర్ కొంత సైన్యంబుతోఁ
    జనె వాఁడెంతయు భీతుఁడై యతని పజ్జన్ జేరె ఢిల్లీశుఁ డా
    తని సీమన్ గొని కొన్నిపల్లె లొసఁగెన్ దజ్జీవ నార్థంబుగన్. 202 202
    
మ॥ మును బై రాముఁడు రాజరక్షకుఁడు తత్పుత్రున్ బదాఱేండ్ల వా
    నిని నబ్దూరహీమాను సైన్యపతిగానేమించి యాఘూర్జరం