పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

129


    దనదు నానతి లవమైనఁ దప్పెనేవి
    ప్రళయ మగుఁగాక యెవ్వఁడు బ్రతుకఁ గలఁడు. 194
    
గీ॥ భోగసన్న్యాసమున వీరిపూర్ణ దీక్ష
   పట్టి యిటఁ బ్రతాపుఁడు కష్టపడుచు నుండ
   రాజ్య తృష్ణాభరైక పూర్ణవ్రతంబు
   దీక్ష గొని యక్బ రచట సాధించు చుండె 195
   
-: అక్బరు సార్వభౌముని దిగ్విజయములు. :-

సీ॥ అంబరు దేశమందా రణ స్తంభ పు
            రము నాఫ్గనుఁడు పాలనము నొనర్చె
    నల శమంతకసింహుఁడను వీరుఁ డా దుర్గ
            మును వాని కడనుండి కొనుచు 'సుదయ
    పురికి నంకితుఁడవై పరిపాలనము సేయు'
            మని తనపతి శూరధనున కిచ్చెఁ
    గోటవాఁకిటనున్న గొప్పపల్లె శమంత
            కుఁడు గొని తా నేలుకొనుచు నుండె
            
గీ॥ గొండకున్న దుర్భేద మాకోటఁ గొనఁగ
   దండువిడిసి యక్బరు నిల్చెరెండు నెలలు
   చెంతనున్న మందంత పోసినను గాని
   జయమొదవునన్న యాస లేశమును లేక. 196
   
సీ॥ తురకలు సంధిగోరిరి దుర్గపతి యొప్పే
              సేవకుఁడును మానసింహుఁ డరిగి
    రంద ఱాస్థానమునందుఁజేరిరి శూర
               ధనరావు పినతండ్రి తనకెదురుగ
    మానసింహుని పీఠమాని నిల్చిన భటుఁ
               గనుఱెప్ప పెట్ట కొక్కగతిఁ జూచి
    యక్బరని గ్రహించి యతని చేతులు వట్టి
               సింహపీఠమున నాసీనుఁజేసె