పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

125



క॥ పెరుగును గావుత చికురో
   త్కరము శిర శ్చుబుక గండతలముల భద్రా
   కరణము వేయింపక యుం
   దురుగాత మహర్షికోటితో నేనయగుచున్. 178
   
క॥ మొరయునుగావుత ముందఱ
   మొరసెడు దుందుభులు వెనుకమొగమై యనిలో
   నఱ నిదురయు నఱ కడుపును
   బొరయఁగఁ బూనుదము వీరపూర్ణ వ్రతమున్. 179
   
సీ॥ ఈశ్వర పదభక్తియెపుడు మానఁగరాదు
              మధుమాంస సేవన మఱగరాదు.
    బంగారు పట్టు వల్వలు గట్టఁగారాదు
              భోగకోటుల వంకఁ బోవరాదు
    కామాది శత్రు వర్గము లంటరాదు స
              త్యంబు శౌచము విడనాడరాదు
    త్యాగంబుఁ గల నైనఁ దగ్గనీయంగరా
              దాత్మ నిగ్రహము పోనాడరాదు
              
గీ॥ మాన ముత్తమధనమౌట మఱువ రాదు
   ధర్మమే దైవమనుబుద్ధి తలఁగరాదు
   నిఖిల జగములు మాఱొడ్డి నిలుచుఁగాక
   దేశభక్తిని విడనాడి తిరుగరాదు. 180 180
   
సీ॥ స్వాతంత్య్ర ధర్మవాంఛాశీలురగు వారి
             దారిఁగష్టంబులు చేరియుండు
    నావిపత్కోటితో నడలక వీరులు
             శాశ్వత యుద్ధంబు సలుపవలయు
    ననుపమ త్యాగ సమారాధనములతో
             ధర్మదేవతఁ గొల్చి తనుపవలయుఁ
    దద్భక్తజన జీవితమ్ము దుర్దమ తపో
             మయమై సురక్షితంబయి తనర్చు