పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


సీ॥ సమరముల్ నిష్కారణమ రేఁగి రత్నగ
              ర్భయు రక్త గర్భయౌ పనికిఁ జాల
    నొకచీమకైన నించుక హాని గలిగినఁ
              గనలేను; భారతా వనిని గలుగు
    తరు లతా గుల్మ భూ ధర గహ్వరములఁ బ్రే
              మింతుఁ బ్రాణమును బ్రే మించు నట్లు
    నాదు హృద్బంధు లిందఱ మిమ్ముఁ గొనిపోయి
              రణరంగమునను శాత్రవుల కత్తి
              
గీ॥ వాదరల కప్పగింపఁగా వలయు ననిన
   మేరు వంతటి బాధ జన్మించు నాకుఁ
   గటకటా! కోరరాని దు ష్కార్యముల ర
   ణంబు నంతటి ఘోర కృత్యంబు గలదె 173
   
గీ॥ అలరుమేవాడ లక్ష్మీ ము ఖాబ్జమునకుఁ
   గుంకుమం బట్టి చిత్తూరు గుఱుతుఁబాపి
   యిపుడు హారావళీసీమ నెల్లఁ గొనఁగ
   నక్బరు తలంచినట్లు తెలియంగ నయ్యె. 174
   
గీ॥ రాజ్యలక్ష్మి సేనాలక్ష్మి రౌప్యలక్ష్మి
   లంచములు చూపి యతఁడు వంచించి తీఱు
   నెంత బలవిక్రమము లున్న నిపుడు మనకు
   నాత్మనిగ్రహమును ద్యాగ మవసరంబు 175
   
గీ॥ ఏను మొదలుగ సామంతు లెల్ల ప్రజలు
   రజత సౌవర్ణ రత్న పాత్రములు విడిచి.
   ప్రకృతి యర్పించు పచ్చఱా పళ్లెరములు
   చదురుటాకులందున మెసవుదము గాక. 176
   
గీ॥ తలఁచిన మనోరధప్రాప్తి గలుగుదాఁక
   వ్రతము నడపిన దశరధ రాము కరణి
   హంసతూలికా తల్పము లవల విడిచి
   మృదుల దర్భాసనముల నుండుదము గాక.177 177