Jump to content

పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

11

     శౌర్యమతి దయాశుచితాంగశాంతి సత్య
     భావనీతుల వేంకటపతికవీంద్ర!

సీ. భూరి శృంగారంబు పొడగట్టి నిలిచిన
                          పోలిక ఘనరసస్పూర్తి జెలఁగ
     వలపుబోవని నీటి పైఁదేలుపూవుఁ జ
                          ప్పరము దెఱంగున భావమలర
     వనధివీచిక మీఁద వచ్చు వాలుగవిధం
                          బున నొకమిన్న గమ్ముకొనిరాఁగ
     నాడెమై ననుఁగాంచు ననుఁగాంచు మనుచును
                          బ్రాణముల్గల పదరాజి మెఱయ

గీ. మునుపు నిపుడుఁ గవు లొనర్చు ననువుఁదెనుఁగుఁ
     గబ్బములలోనఁ దెరనాటకంబులెస్స
     గా వినికిసేయుగతి నలంకార సరణి
     వెలయ రచియించు యప్పయ వెంకటార్య.

సీ. [1]అల విన్న కోట పెద్దన లక్షణజ్ఞత
                     శబ్దశాసనకవి శబ్దశుద్ధి
     బ్రాబంధిక పరమేశ్వరు నర్థమహిమం బు
                     భయకవిమిత్రుని పదలలితము
      శ్రీనాథువార్తా ప్రసిద్ది నాచన
                     సోము భూరికాఠిన్యంబు, పోతరాజు
      యమకవిధము మల్లయమనీషిచి
                     త్రంబుఁ, బింగళ సూరకవివరు శ్లేష

గీ. నాంధ్రకవితా పితామహు నల్లిక బిగి.
      ముక్కుతిమ్మన తేటయు భూషణుని య
      లంకృతియు, నీకే గలదౌ తలంప లక్ష
      ణకవి యప్పయ వేంకటసుకవిచంద్ర,

  1. ఈ మహాకవి “కావ్యాలంకార చూడామణి" యను లక్షణ గ్రంథమును దెనుఁగున వ్రాసియున్నాఁడు (పూ రా.)