పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxvi

సుగంధివృత్తము, సగర్బకంంద మణిగణనికరవృత్త తేటగీతి, సగర్బ మత్తకోకిల వృత్త సీసము, శకటబంధ కందము, అనులోమ కందము.

24. సింహాద్రి వేంకటనామధేయ విరచితమగు చమత్కార మంజరి యందుఁ బుష్పబంధ స్రగ్ధరావృత్తము, చక్రబంధ శార్దూలము.

25. రామకృష్ణోపాఖ్యానమను శ్లేష కావ్యమునందుఁ గందగీత గర్భిత చంపక మాల, పుష్పమాలికబంధ చంపకము, స్రగ్విణీగర్భ భుజంగప్రయాత వృత్తము, కందగర్భ మణిగణ నికరవృత్తము.

28. ధరణి దేవుల నాగయ్య విరచితమగు దశావతారచరిత్రమున నోష్ట్యాంచలజిహ్వద్వ్యక్షరీ కందము, పుష్పమాలికబంధ చంపకమాల, గోమూత్రి కాబంధ చంపకమాల, ఛత్రబంధ కందము, నాగబంధ స్రగ్ధరావృత్తము, పాదగోపన చంపకమాల, అనలోమ విలోమకందము, అష్టదళ పద్మబంధ స్రగ్ధర మంజుభాషిణీగర్భ యుత్పలమాల.

27. వేదాంతదేశిక విరచితమగు పాదుకాసహస్రమునం దుత్తర భాగమున గోమూత్రీకాబంధము, ముర జబంధము, శరబంధము, గరుడగతిచక్ర బంధము, ద్విశృంగాటక చక్ర బంధము, ద్విచతుష్క చక్రబంధము, చతురర్త చక్రబంధము, అష్టదళ పద్మ బంధము, సకర్ణిక షోడశ పద్మబంధము, చతురంగ తురంగ పదబంధము సర్వతోభద్ర యివి వ్రాయబడియున్నవి. వెండియు బ్రహ్మశ్రీ వఠ్యము పరబ్రహ్మ శాస్త్రులవా రనేక బంధములు సంస్కృతాంద్రముల యందు వ్రాసి యున్నారు. వానిలోఁ గంకణబంధము మిగులఁ జిత్రముగనుక నిందుఁ బొందు పఱచుచున్నాము. ఈ కంకణబంధమున నెచట నారంభించి చదివినను శ్లోక మేర్పడుచున్నది గాన నిందు 84 విద్యున్మాలా వృత్తములుగల కంకణ బంధము లగుపడుచున్నవి.

    శ్లో. వ్యాసాద్యావా కామాధ్యాయా
        పాల్యాత్వా గాత్రీలాత్రాశా
       స్త్రాధారాభా టీక్యాభ్యాప్యా
        లీనామేహా వైస్మాస్యాభా.

(విద్యున్మాలావృత్తాని 64 కంకణబంధోదితాని) పై నుదహరించిన గోమూత్రీకాబంధ పుష్పమాలికాబంధ పుష్పగుచ్ఛబంధ ఛత్రబంధనాగబంధములు,