Jump to content

పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxvii

తెలుఁగుఁ గబ్బములలో నానావిధ పద్యములతో వ్రాయఁబడియున్నవి-ఎట్లనఁగా గోమూత్రీకాబంధము సుగంధివృత్తము నందును ఉత్సాహవృత్తము నందును చంపకము నందును గందము నందును; పుష్పమాలికాబంధము సీసమునందును స్రగ్ధరయందును, చంపకమునందును, రథబంధ కందమునందును సీసము నందును; పుష్పగుచ్చబంధము పంచచామర వృత్తమునందును, విద్యున్మాలా వృత్తమునందును మాణవక వృత్తమునందును స్రగ్ధరావృత్తము నందును, నాగ బంధము చంపకమాలయందును; నాగబంధము చంపకమాల యందును స్రగ్ధరా వృత్తమునందును నిమిడ్చి వ్రాసియున్నది. ఒక బంధమునే వివిధపద్యములతో వ్రాయుటకు లక్షణ మెయ్యదియో విచారించునది.

(19) సర్వఘు సీసము. అవకలివడి సీసము, అక్కిలివడి సీసము, సర్వతః ప్రాససీసము, విషమసీసము, వడి సీసము, సమసము అను సప్త విధ సీసములలో నీ గ్రంథమునందుఁ గొన్ని భేదములు 1 12-47-75-221-224 547-802-813–814 పద్యములలో వ్రాయఁబడియున్నవి. వీని కన్నింటికి లక్షణ మప్పకవీయములో వ్రాయబడియున్నది చూడుడు.

(20) హయప్రచార రగడ, తురగవల్లన రగడ, విజయమంగళ రగడ, ద్విరదగతి రగడ, విజయభద్ర రగడ, మధురగతి రగడ , హరిగతి రగడ, హరిణగతి రగడ, వృషభగతి రగడ అను నీ తొమ్మిది విధముల రగడ లలో, నీ గ్రంథమునందు నైదు విధముల రగడలు మాత్రమే యుపయోగించి యున్నాఁడు. అవి యనఁగా ముప్పైతొమ్మిదవ పద్యమునందు హరిగతిని, 253వ పద్యమునందు మధురగతిని, 256-263 పద్యములలో వృషభగతిని, 369-808 లో గర్భితము (25) పద్యములలోఁ దురగవల్గనమును, 877వ పద్యములో ద్విరదగతిని మాత్రము నుపయోగించియున్నాడు. కొన్ని ప్రబంధములలో వీని భేదములు గల పద్యములు వ్రాయఁబడియున్నవి. ఆ యాఱు భేదములకు లక్షణము అప్పకవీయమునందు వ్రాయఁబడియున్నది. ఇంతియకాక నీ గ్రంథము నందు 805 పద్యమును శృంఖలిఖిత రగడమని వ్రాయబడియున్నదిగాన నీదాని లక్షణము విచార్యము, దీని లక్షణ మప్పకవీయమునఁ గనుపడదు.

(21) కందము, పథ్య, విపుల, చపల, ముఖచపల, జఘనచపల, అని యప్పకవీయమునందుఁ జెప్పఁబడిన కందభేదములలోఁ గందము తప్పఁ