పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/345

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఫలశ్రుతి
క. ఇది వేంకటేశు పేరిఁట
నొదవించు విలాస మెవ్వరొక దినమేనిన్
జదివిన వ్రాసిన వినినను
మదికోర్కులు సంఘటించు మనుజులకెల్లన్. 886

చ. గణపవరాన్వయంబు నిధి కైరవబాంధవుఁ డప్పనార్యు ల
క్షణకవి వేంకటార్యమణి సంతతశోభన కీర్తిసంతతుల్
గణనకు నెక్క వేంకటనగప్రభు పేర నొనర్చె సత్కవి
ప్రణుత విలాసరాజము ధరన్ దగనా విధుతారకంబుగన్.

సంపూర్ణము