xxxiii
1. పెద్దన ముకుందవిలాసమునందు వృత్త కంద గర్భిత సీసము. ద్విపద చౌపదలాలీశోభానమంగళారతి సువ్వాల ధవళాది వివిధ భేద సీసము కందద్వయ గర్బిత చంపకమాలికావృత్త విశేషబంధచిత్రకందము, శైలబంధ చిత్ర కందము, పుష్పగుచ్ఛ బంధ చిత్ర పంచచామరవృత్తము, చక్రబంధ చిత్ర శార్దూలము , ఛత్రబంధ చిత్రకందము, గోమూత్రీకాబంధ చిత్రసుగంధి వృత్తము, నిరోష్ఠ్య ద్వివిధకందము.
2. కనుపర్తి అబ్బయకవి కవిరాజమనోరంజనములోనఁ గంద ద్వయ రుగ్మవతీ కమలవిలసితగర్భ క్రౌంచపద వృత్తము, గోమూత్రికా బంధకందము, గోమూత్రీకాబంధ ఉత్సాహవృత్తము ఛత్రబంధకందము చక్ర బంధశార్దూలము ఖడ్గబంధకందము, పుష్పమాలికాబంధ చంపకమాల, నాగబంధ చంపకమాల, పాదభ్రమక కందము, ఓష్ఠ్యకందము, నిరోష్ఠ్య మహాస్రగ్ధర, సర్వతోభద్రబంధశ్లోకము, ద్వక్షరకందము, ఆంధ్ర గీర్వాణ భాషాశ్లేషకందము.
౩. పారిజాతాపహరణమునందుఁ బాదభ్రమకకంద, గోమూత్రీకాబంధ కందము, నాగబంధ చంపకమాల, ఛురికాబంధకందము, చక్రబంధశార్దూలము, ద్వక్షరకందము, ద్విపద క్రౌంచపదవృత్తము, గర్భిత భుజంగప్రయాత స్రగ్విణి.
4. బట్టుమూర్తిగారి నరసభూపాలీయమునందు అష్టదళ పద్మబంధము, వృత్త కంద గర్భసీసము, చక్రబంధము.
5. భరతాభ్యుదయమునందుఁ బుష్పమాలికా బంధ సీసము, పుష్ప గుచ్చబంధ విద్యున్మాలావృత్తము, మత్తేభ మణిగణనికర వృత్తద్వయ గర్భిత సీసము, కందపద్య గర్భిత చంపకము చక్రబంధ తరళవృత్తము, నిరోష్ట్య కందము, సర్వౌష్ఠ్యకందము, అచలజిహ్వోక్తిగీతము, పాదభ్రమక కందము.
6. ఓగిరాల జగన్నాధముగారి సుమనోమనోభిరంజనమునందు నాగబంధచంపకమాల, ఛత్రబంధకంద ము, మర్దలబంధకందము, పుష్పమాలికాబంధ చంపకము, గోమూత్రీకాబంధకందము, పుష్పగుచ్ఛ బంధమాణవక వృత్తము.