పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxii

శ్లో. ఆవృత్తిద్యుగ్మ వర్జానాం నేతరేషా మిహక్వచిత్
     అర్కేశానదశ బ్రహ్మ వర్ణః పాదచతుష్కగాః
     ఆవర్తేన్నైరృతాది కుండలేష్వ ప్రదక్షిణం
     యదై వంస్యాత్తధావర్ణా స్ఫణాతో విన్యసేత్క్రమాత్.

శ్లో. త్రించడష్టావింశతిశ్చ షడ్వింశతిరను క్రమాజ్
     వేష్టనత్రితయేవర్ణస్స మాప్తిస్తు గుళాంతరే
     సర్వమ్ తన్ని ధాయాంత స్సంగృహీతం మహాత్మభిః.
 
శ్లో. విదిక్థ్సలే కుండలితం స్వమంగం
    స్వేనత్రిరావేష్ట్య విభంగి భంగం
    క్షిప్త్వాగళేపుచ్చమహేస్థితస్య
    పాద్యః ఫణాతః ఫణిబంధ ఏషా.

అని నాగబంధలక్షణము సాహిత్య రత్నాకరమున వ్రాయబడి యున్నది. ఆంధ్రలక్షణ గ్రంథములలో నెచటను దీని లక్షణమగు పడనందున సంస్కృత శ్లోకమునే వ్రాసితిమి. వాసుకిద్వయబంధమనియుఁ గృష్ణ సర్ప ద్వయ బంధమనియు నాగలింగబంధమనియుఁ గొన్ని భేదములగుపడుచున్నవి. వీనికి లక్షణము విచారించునది

    (c) రథబంధకందమునకు సంస్కృతాంధ్రములయందు లక్షణ మగుపడదు ఈ గ్రంథమునందలి 854 వ పద్యమగు రథబంధ కందమునందలి 1, 3, 7, 21, 29, 35, 39, 40 యీ సంఖ్యలు గల యక్షరములను జేర్చి చదివినచో 'శ్రీవేంకటేశ నీవేగతీ' అని బంధ మధ్యమునం దేర్పడుచున్నది. ఈ రథబంధమును సీసపద్యముతోఁ గూడా బ్రహ్మశ్రీ గోపీనాధము వేంకయగారి కృతమగు శిశుపాల వధమహాకావ్యమున వ్రాయఁబడియున్నది. అందలి నడిమి యక్కరములఁ జేర్చి చదివినయెడల “శ్రీరాజ గోపాలకృష్ణ యాచేంద్రమ హీరమణ" అని చిత్రము గనుపడుచున్నది. ఈ రథబంధములు చిన్నవిగను పెద్దవిగకు నానావిధములుగఁ గవులు వ్రాసియున్నవి పెక్కులు గనుపడు చున్నవి. వీనికన్నిఁటికి లక్షణము విచారించునది.

18) ఇతర గ్రంథములలోని బంధకవిత్వ చిత్రకవిత్వ గర్భకవిత్వ పద్యముల నామములఁ దెలుపు పట్టిక.