పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

ప్రబంధరాజవేంకటేశ్వర


వ. తదనంతరంబు.

క. సంగీతపు మేళపు జత
    సంగతి తాళములు నాగసరములు ఢక్కీల్
    చెంగులు ముఖవీణియలు ను
    పాంగము తప్పెటలు గజ్జలందుక చేరన్. 93

మ. ఎకతాళంబున వీరమర్దళరవం బేకంబుగా నట్టువుల్
    ధికతోంతత్తక ఝంకు ఝంకు కిణతాం ధిత్తాంకియల్లో ధికు
    ద్ధికు తెత్తెయ్యధిమిక్కు తక్కుధిగుతాంధిత్తాత్త తాళంబులన్
    గకుబంతంబుల మాఱుఁబల్కు కొను గోల్పట్టనప్పట్టునన్. 94

సీ. భైరవ శ్రీరాగ బంగాళ హిందోళ
           మాళవులును రాగమంజరియును
    భూపాళ గౌళు లన్భురుష రాగాష్టకం
           బహిరి లలిత బిలాహరులును
    గుజ్జరి మలహరి గుండక్రియ వరాళి
           దేవగాంధారియు దేశతోడి
    దేవక్రియ కురంజి దేశాక్షిరామ క్రి
           యాంధాళి నాట ధన్యాసి పూర్వ
గీ. గౌళ సారంగ మంగళ కౌశికులును
   కన్నడయును చాయ గౌళ కడు నపూర్వ
   మైన భల్లాతకియును నారాయణియును
   గ్రమత నిరువది నాల్గు స్త్రీరాగములును. 95

సీ. కాంభోజియును గుమ్మకాంభోజియును సింధు
            రామక్రియయు నాదనామక్రియయు
    రామక్రియయు మేళరామక్రియ వసంత
            సామంత శుద్ధవసంత మధ్య
    మాదులు సామంత మలహరులును చెంచు
            మలహరి ముఖారి మాళవియును
    గౌళనారాయణ గౌళవసంత
            వరాళిపున్నాగ వరాళిశంక