Jump to content

పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

శ్రీ దే వీ భా గ వ త ము


ప. అది యట్లుండనిండు.515

క. జగదీశ్వరి స్వప్నంబున నగవడి ప్రేరేప నిచటి కరుదెంచితి నేఁ
   దగ దేవికరణ యుదయిం | పఁగ నవ్విన నాపచేలు పండకయున్నే. 516

తే.గీ. కుడువఁబోయెడి కూర సొం పడుగనేల | నేమి కానున్నదో చూత మిందఱమును
   దేవి నాపాలఁ గల్గెనే వేవు రవని | పాలకులు వచ్చియును నన్నుఁ బట్టలేరు. 517

క. దైవాధీనుఁడనై నే | నీ విధమున నున్నవాఁడ నేమైననుఁగా
   నీ వచ్చునదియ వచ్చున్ | బోవునదియ పోపు రిత్తఁబోవఁగ నొల్లన్.518

వ. ఇట్లు చెప్పిన సుదర్శను మాటలు వినిన యజ్ఞులగు కొందరు అబ్బా! యిబ్బాలున కెంత
    నిబ్బరంబని యబ్బురంపడి యిట్లనిరి.519

తే.గీ. నీవు చెప్పినదియసూ నిక్కువంబు | అయిన నుజ్జయినీనాధుఁ డడరి చంపఁ
    గాచుకొనియున్నవాఁడు నీ కాపుగోరి | చెప్పితిమి యిచ్చవెంబడిఁ జేయు మవల.520

ఉ. సత్యము మీరు స్నేహమునఁ జక్కటిసెప్పుట యుక్తమేకదా
    వ్యత్యయమేమియున్నదని యాడెద లోకమునందు మృత్యురా
    హిత్యము నొందువారు కలరే యెపు డెవ్వనిచేత నెవ్వఁడే
    కృత్యమున న్నశించు నది యెల్లను జేయును గాలకర్మముల్.521

క. సంచితమును ప్రారబ్ధం|బంచును నాగామియంచు నాత్మవిదులు దా
    రెంచిరి త్రివిధముగా న| య్యంచిత కర్మమును మానవాధిపులారా.522

తే.గీ కాలకర్మస్వభావసంగతుల జగము | వితతమాయెను మానుషకృతము నడుఁప
    దైవమేనియు నేరఁడు దానికొఱకు | నేర్పడిన కాల మది సంభవించుదనుక.523

5. పడె సింగముచే జనకుఁడు | మడిసె యుధాజిత్తుచేత మాతామహుడున్
   వడిఁజచ్చు రక్షితుఁడు భువి | విడిసి యరక్షితుఁడు బ్రతుకు వేయేండ్లు దగన్. 524

సీ. పూర్వార్జితంబది పుణ్యమో పాపమో భోగింప కూఱకేపోదుసుండు
    తాను జేసినదానిఁ దాన భోగింపుచు దుఃఖింప నందేమి దొరుకు వృధయ
    తన కర్మఫలయోగమునఁ గీడువాటిల్లఁ బరులతో నల్పుండు పగవహించు
    వైరంబు శోకంబు భయమే నెఱుంగక చనుదెంచినాఁడ నిశ్శంకమతిని
తే.గీ. నాకు భయమేమి యిప్పు డేకాకిననుచు నెందఱెందరు పలుగాకు లిందు మాల
    కాకులై యవివేకులై కడకుఁ గాందిశీకు లయ్యెదరో దేవిచేత బిదప.525

తే.గీ. ఆ యుధాజిత్తుపై నాకు నలుకలేదు | చెలఁగి నామీద నయ్యుధాజిత్తునకుమ
    నలుకయేటికి సూఱకే కలిగెనేని | ఫలమనుభవింప కంతంతఁ బారఁదరమె 526