Jump to content

పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృ తీ య స్కం ధ ము

199

క. బలముగలవాఁడె కన్నియ |బలిమిం గొనిపోవుగాక బలహీనులకున్
   ఫలమేమి శుల్క మీ నృవ |కులమువకున్ బలమెకాదె కుంభిని నెందున్.506

శా. రాజన్యుండు బణస్వయంవరము విభ్రాజద్గతిం బన్న కీ
    యోజం బూనుట రాజధర్మమగునే యుద్ధమ్ము గావింప కే
    రాజేగుం దన తొంటిదారిని వృధా ప్రాగల్భ్యము ల్మానుమీ
    రాజై పుట్టుట వీరధర్మములు పోరం జూపఁగాదే నృపా. 507

వ. ఇట్లు స్వయంవరంబుకై వచ్చిన రాజులలోని బరస్పర వివాదంబులు పుట్టెనని విని
   సుబాహుండు మంత్రిముఖంబుల నెల్లరాజుల సభామధ్యంబునకు రండని వర్తమానంబు
   పంపిన వారలందరు రచ్చకు విచ్చేసియున్న సమయంబున వారణాశీ విభుంగాంచి
   తత్త్వదర్శులగు కొందఱు, మానవేంద్రాః భవత్కుమారీరత్నంబు నెవ్వని కీఁ దలంచితివి?
   నీయభిప్రాయంబు విన్నవింపుమనిన వారలంజూచి వినయపూర్వకంబుగా సుబాహుం
   డిట్లనియె 508

తే.గీ. తనయ మనముస నా సుదర్శను వరించె | నెంతఁ జెప్పిన వినదు నాకేమిబుద్ధి
   కన్యవశవర్తినియుఁగాదు కన్యకోరి |యున్న యాతఁడు దాని కర్హుండుకాడు. 509

తే.గీ. అంత సంపన్న భూభుజూ లతనిఁజేరఁ | బిల్చిన సుదర్శనుఁడు మతి భీతిలేక
   శాంతి నేకాకియై వచ్చి సరసనిలువ | జనవరులు పల్కి రా సుదర్శనునితోడ. 510

చ. పిలువని పేఱటంబనకి భీతిల కీ విటువచ్చి తేరు నిన్
   బిలిచిరి యొంటివయ్యు భటబ్బందము లేక సహాయసంపదల్
   వెలయక వచ్చి నీవు తలపెట్టిన దెయ్యది సేయ భూపతు
   ల్దళములతోడ వచ్చిరికదా రణరంగమునందుఁ బోరఁగన్. 511

ఉ. వచ్చెను నీదు భ్రాత బలవంతుఁడు పోరున గెల్చువాఁడయై
    చెచ్చెఱ నయ్యుధాజితు విశేషసహాయుఁడు వానిఁ జూచితే
    వచ్చితిపో సరే మరలి వచ్చిన దారిన పోవువాఁడవా
    క్రచ్చఱ నిచ్చట న్నిలచి వ్రాతకొలంది నటింపఁ జూతువా. 512

వ. అనిన విని సుదర్శనుండు.513

చ. బలగము లేదు చుట్టములు పక్కములేరును లేరు భూపతు
    ల్కలరు సహాయులందుఁ బలుకన్ బనిలేదు ధనంబు లేశమున్
    దలఁపఁగరాదు కాశిపతినందని కిప్డు స్వయంవరమ్మటం
    చలరుచు వచ్చినాఁడఁ దగనా పగనా తెగనాడనేటికిన్.514