పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

శ్రీ దేవీ భాగవతము


ఉ. గడ్డము సూచియో జడలు గన్గొనియో నిదుగాళ్లు సూచియో
    దొడ్డవిభూతిపూత పులిత్రోళ్ళను జూచియొ పట్టియున్న మేల్
    బుడ్డిని గఱ్ఱనుం గనియొ పూవిలుకానికి లోగి పల్లేరా
    బిడ్డ యొకింత సిగ్గుపడి మెల్లన నవ్వుచు ముద్దుముద్దుగాన్. 31

సుగంధి. దొడ్డ జాతి సుశ్రుతవ్రతుండ వీవు సూడగా
    నడ్డుగాన నవ్వసిష్టు నన్వయంబు నీదకా
    మడ్డిమేను చేపకంపు, మంచిదంచు నెంచితే
    యెడ్డెదాన నన్నుఁబట్ట నేఁటికిం బరాశరా.32

తే.గీ. బ్రాహ్మణకులంబు నీది నేఁ బల్లెదాన | వేదవిదుఁడవు శాస్త్రార్థవేత్త వీవు
    తప్పుతడక లల్లిబిల్లి యీ తెప్పపాట | లాలకింపఁగ మనసాయెనా ? మునీంద్ర.33

క. ఎన్నడు నిటువంటిది నేఁ | గన్నది విన్నదెందు గాదు కడునీచము నా
    యున్నయునికి బ్రాహ్మణుఁడవు  ! నన్ను స్పృశించెద విది తగునా నీకిచటన్.34

పి. అనియిట్లు పలుకుచున్న యమ్మిటారిపలుకులు విని యంతకంతకు మోహింబగ్గలంబై
    యమ్మునికుల సార్వభౌముండు చేతోజాతయాతనాతిభీతిం బరవశుండై యన్నాతి కరంబు
    విడువకయ తటుక్కునం బడిన నదీజలంబుల మునుంగుదుమో యని బెదరి యదరిపడి
    యద్దాశమదవతి గడగడ వడంకుచు నతనితో నిట్లనియె.35

మ. సరియే మంచిది నీప్రయత్నమునకున్ పంకింతు నామేని కం
    పరియౌ నిందున కేమిసేయగలవో యన్న న్మునీంద్రుండు వి
    స్ఫురణంబైన నిజప్రభావమున గర్పూరంపుఁదావుల్ దిశల్
    గరప న్యోజనగంధిఁ జేసె నపుడే కళ్యాణియున్ రంజిలెన్. 36

క. వనితారత్నంబును యో | జనగంధిజేసి దాని శయమును మరలం
    దనచేతఁ బట్టి పలికెన్ | వనజేక్షణ నీవు సత్యవతి విఁక నంచున్.37
 
క. ఇదికా సమయంబని తా | మదిఁ దత్తరపడుచునున్న మౌనిని గని యా
    ముదిత పలికె నోబ్రాహ్మణ  ! యదనా యిది పగలు చూతు రప్పయు నితరుల్.38

ఉ. రాతిరివచ్చుదాఁక మునిరాజు తొలంగుము పాశవక్రియల్
   సేత యధర్మమౌ తగదు చీకటి మే లిది నమ్ముమన్న న
   త్యాతురుఁడైన బాపఁడు రయంబున మంచును గల్గజేసి యో
   నాతి యిఁకేల జాల మన నవ్వి పరాశరుఁ జూచి యిట్లనెన్.39
 
ఉ. మంచిది తాపసేంద్ర యొక మాటను జెప్పెద నాలకింపు మీ
    మంచున నన్నుఁగూడి నిజమార్గము పట్టుదు రీరు మీ రమో