పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్ని చో డు ( డు 199 మైన మార్పు వచ్చియుండదు. రెండువిధ యులైన ప్రయోగములును నా కాల యునఁ బచారములో నుండియుండుననియు, పద, ప్రయోగాది భేదము లనుసరింపబడిన కాలమును గీటు పెట్టి నియించుట సాధ్యము కానిపవియ నియు, నందుచే దానినిబట్టి కాలనిర్ణయము చేయుటలోఁ బమాదము వచ్చుననియు నాయభిప్రాయము. ఇంతే కాదు నన్నయ నన్ని చోులు భిన్నమార్గముల ననుసరించిపోcున కవులు, నన్నయ భవకవి, నన్నెచోడుఁడు శివకవి. సంస్కృతపద బాహుళ్యములో దేశీయ పదములను సాధ్యమైనంతవఱకు తగ్గించియు సంస్క-రించియు సాంధ్రమున భాషా సాంకర్యము లేకుండ ("దేనుఁగున కొక కొత్తందనమును దెచ్చిపెట్టుచు రచనమును జేయ సంకల్పించు కొనిని వాఁడు నన్నయ. కన్నడము కనైన నేమి, యాంద్రమున నైన నేమి, యప్పటికి వాడుకలోనున్న పదములను విశేషముగాఁ జేర్చి జానుతెనుఁ గునఁ గవిత్వమును జెప్పఁ గో ర్కె-కలవాఁడు నన్నిచోడుఁడు. వీరిరు వురు నెవరి మనోరథములను వారీ డేర్చుకొనిరి. నన్నయకం రెు నన్ని చోడుఁడు పూర్వఁడేయనుకొందము. నన్నెచోడుని నాఁటి శబ్దజాల మును బయోగసరణులును నన్నయ కాలమునాఁటి కంతరించిపోయెు నిని యు, నన్నయ పోకడలు క్రొత్తవిగని యుఁ జెప్పజాలము. నన్ని చోడుని గ్రంథమును చదివినకవి నన్నయకు జాల కాలము తరువాత నున్నవాఁడుకూడ నట్టి ప్రయోగములు సాధువులని తలంచి తన Uగcథ మునఁ బ్రయోగింపవచ్చును. తిక్క-నసోమయాజి, భారతమును చిన్న చిన్న దేశీయపదములలో నింపివేసినాఁడు. ఆతనికవిత్వములోఁ జాల భాగము జానుతెనుఁగనియే చెప్పవచ్చును. నన్నయ కాలమునను, నంతకుఁ బూర్వమును దరువాతఁ గొంతకాలము వఱకును నాంధ్ర దేశ మనకను నాంధ్రభాషకును గన్నడ దేశ, భాషలసంపర్క-మతగ్గిపోలేదు. కుమారసంభవమందలి పద ప్రయోగాదులనుబట్టి, నవ్నిచోడుఁడు ప్రాచీ నుఁడనియు, నతనిది ప్రాచీన కవిత్వమనియు మాత్రమే చెప్పఁగలము. కాని వానినిబట్టి యతఁడు నన్నయకుఁ బూర్వఁడో పరుఁడో నిర్ణయింపఁజాలము