పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



‘శకాబ్ధేయుగ నందరంధ్రగణితే చైత్రం గతే భాస్క_రే
శ్రీవూమార్కండ మహేశ్వరాయ వసతే గోదావరీప్రాక్త టే
ప్రా దాద్దీప మఖండ వర్తి మనిశమ్ విప్రప్రదీపాస్స్వయమ్
భీమ శ్ర్ళీ మచ మాత్యకృత్యనిపుణో మాతా" పితృశ్రేయ సే”

స్వస్తి సర్వలోకాశ్రయ విష్ణువర్దన మహా రాజుల ప్రవర్ధమాన విజయరాజ్య సంవత్సర 12 శ్రాహి విష్ణసంక్రాంతి నిమిత్యంబున మాత్కండీశ్వర మహాదేవరకు భీమన ప్రెగ్గడలు వెట్టిన యఖండవర్తి దివియ • • • • • • • • • ఈశిలాశాసనము గోదావరి మండలమందలి రాజమహేంద్రవరము న మ్యూజియములో నున్నది. (A. R. 1983 పుట 56-56) ఈశాస నము శక 994 క్రీ.శ. 1072 నాఁటిది.

ఈ శౌసనముందలి సర్వలోకాశ్రయ విష్ణువనమహారాజు మహాభాతకృతిపతియగు రాజరాజనరేంద్రుని సవతి సోదరుఁడగు విజయాది త్యుడేకాని యన్యుడు కాఁడు. దొరతనము వారి శాసనపరిశోధక శాఖవారీతనిని రాజరాజకుమారుఁడగు కులోత్తుంగచోడుఁడని భావించిరి. క్రాని యది సరి కాదు.

ఆ విజయాదిత్యునియొద్ద మంత్రిగానున్న భీమనప్రెగ్గడ వ్రాయించిన శాసనమిది. ఈ భీమన యెవ్వరో మనము తెలిసికొనవలసి యున్నది. ఈ భీమనప్రెగ్గడ నన్నయభట్టు కుమారుఁడని నాయభిప్రా యము. నన్నయభట్టుతండ్రి భీమన భట్టు కావచ్చునని పైన వాసి యుంటిని. తండ్రి పేరు తనకుమారునకుఁ బెట్టనాచార విూప్రాంతముల యందు చిరకాలానుగతమై యుండుటచే, నన్నయభట్టు తన తండ్రి పేరు కుమారునకుఁ బెట్టియుండవచ్చును. వంశానుగతమైన రాజాశ్రయము నన్నయభట్టునకుఁ బిమ్మట నీ భీమన ప్రెగ్గడకు వచ్చియుండును. రాజరాజునకు తరువాత నాతని సవతి సోదరుఁడైన వేంగి దేశపరిపాలనాధికారము వహించిన విజయాదిత్యునియొద్ద నీభీమన మంత్రియై యుండును. ఈశాసనము రాజమహేందవరమునందే యుండుట వలనను, ఆందలి