పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

 భారతమునుబట్టి నన్నయ పూర్వలవిషయము మనకేమియుc దెలియదు. భారతకృతిపతియైన రాజరాజనరేందుని తండి యగు విమలాదిత్యుడు, వజ్జయప్రెగ్గడ కగహా5 మునిచ్చి వ్రాయించిన రణస్థి పూఁడి శాసనము యొక్క- కావ్యక_ భీమన భట్ట రాజరాజు వ్రాయిం చిన కోరుమిల్లి, కలిదిండి శాసనముల కావ్యక_ర్త భీమన భట్టు కుమారుఁ డైన బేతనభ్చ. ఆ రాజరాజ నరేంద్రుఁడే వాయించిన నందంపూడి, మండ శాసనములను రచించినది నన్నియభట్టు. రణస్థిపూఁడి శాసనకర్త మైనిభీమనభట్టును, కోరుమిల్లి కలిదిండి శాసన కావ్యకర్తయైన బేతన భట్టునకుఁ దండి యగుభీమన భ్బను నొక వ్యక్తి యే యని నిస్సంశయ ముగాఁ జెప్పవచ్పును. (కోరుమిల్లి శాసన కావ్యకర్త చెట్టనభట్టని కొందఱు) నన్నియభట్టు భీమన భట్టు యొక్క రెండవకుమారుఁడోకాక బేతనభ్బ యొక్క కుమారుఁడో, ఆయియుండునని నాయభిప్రాయము. భారతములో c దాను రాజరాజు నకుఁ గులబ్రాహ్మణుఁ డనని నన్నయ భట్టు చెప్పకొనియున్నాడు. ఈవిషయము నాయూహకుఁ బలపెుసం గుచున్నది. కులభ్రాహ్మణుఁ డనఁగా రాజకుటుంబము నాశ్రయించి వంశానుగతముగా వచ్చుచున్న బాహ్మణుఁడని యర్థము, ఈ నన్నియ భట్టు శాసనమునఁ దండిపే రేల చెప్పలేదని ప్రశ్నించుటవలనఁ బ్రయో జనము లేదు, భారతమున నే చెప్పకొననియాతఁడు, దాన పత్రమువంటి oూ శాసనమున లేఖరినావు ముదహరించినట్లు తననామమును మాత్రమే యుదాహరించును. కాని, తన చరిత్రమును లిఖించునని తలంపరాదు. రాజాస్థానములలో సంధి విగ్రహి యుద్యోగము నందున్నయూతఁడు శాసనగ్రంథములను వ్రాయుచుండ నని స్కృతులలోఁ జెప్పఁబడినది. దీనినిబట్టి భీశున, బేతన, నన్నయలు సంధివిగ్రహులని యెంచఁదగి యున్నది. సంధివిగ్రహి మంత్రులలో నొకఁడు, ఈవిషయము శాసన ములవలఁనగూడ స్పష్టమగుచున్నది. భావిపరిశోధనమువలన భీమున, బేతన, నన్నియల బాంధవ్య మెఱుంగఁబడునని విశ్వసి0చుచున్నాఁడను ఈ సందర్భమున నీదిగువ శాసనమును గమనింపవలసియున్నది.