పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

236 ఆ 0 ధ క వి త గ 0 గి శి బృహస్పతిని బోలిన యామహాపండితుఁ డు, అది వఆ కొంధముననున్న పద్యగద్యసాహాయ్యమునను, కర్ణాటకగ్రంథముల తోడ్పాటు నను, శిష్టజనులు వాడుకొనుభాషనుబట్టియు, నపారసంస్కృతగ్రంథసాహా య్యమునను, శ్రీమహాభారతము నాంద్రీకరింప మొదలిడి, తనయపార బుద్ధికౌశలముచేతను, నారాయణ భట్టుసాహాయ్యమును గైకొనియు, శబ్దముల నుచితరీతిని సంస్క-రించి ప్రయోగించుకొనుచు, శబ్దాను శాసనుఁడై, భారతరచనమును గొనసాగించెనేగాని, శబ్ద సంస్కారవుకొఱకు ముందుగ వ్యాకరణమును రచింప నారంభింపలేదు. నన్నయభ స్టేమి ప్రయోజనము నభిలషించి భారతమునకం"Eు ముందుగ నాంధ్రశబ్దచింతామణిని రచియించె నని ప్రశ్నించుకొన వలసియున్నది. తన వ్యాకరణమునకు భారతమును లక్యగ్రంథముగాఁ జేయుcదలంచి వెుదట చింతామణిని గచించెనా ? లేదు. చింతామణి సూత్రముల కన్నిటికి భారతమున లక్యములు లేవు. ఆవిషయమును శ్రీచినసీతారామస్వామి శాస్త్రలవా రంగీకరించియున్నాగు. (ఆంధ శబ్దచింతామణి వీషయపరిశోధనము). భారతమునందలి ప్రయోగ ముల కన్నిటికిని చింతామణియందు సూత్రములు కల్పింపఁబడి యున్నవా ! అదియును లేదు. అంతటియదృష్టము పట్టలేదుగాని, శబ్ద శాసనుఁడు మహాభారతమును బూర్తిగరచియించియున్నచో నింకను నెన్నియపూర్వ ప్రయోగములను జేసియుండునో ? చింతామణికి భారతము లశ్యగ్రంథము "గ్రాడు. భారతప్రయోగముల కన్నిటికి చింతామణి ప్రమాణములను జూపదు. ఇక నన్నయకుఁ జింతామణి వలనఁ ప్రయోజన మేమియున్నది! వమియును లేదు. “సంస్కృత భారతాంద్రీకరణసమర్ధముగఁ డెలుగునుజేయఁగోరి సంస్కృత శబ్దము లను దెనుఁగులోనికి దెచ్చుకొనుటలోని నియమముల నుపదేశించుట. వానికి సుప్తిజ్వీభక్తులను జేర్చుపద్ధతుల నుపదేశించుట ప్రభాన ముగఁ జేసికొని రచింపఁబడిన దగుటం చేసియది యాంధ్ర కావ్య వాజ్మయారంభదశలోని దనిసిద్ధాంతితమగుచున్నదని శ్రీశాస్త్రల