పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

188 ఆ 0 ధ క వి త ర గి శి సింపవీలు కలుగుచున్నది. శర భాంకుఁడు శివ దేవయ్య, విశ్వేశ్వర "దేశిక్షులు సోదరులనియు సీమువ్వుస ప్రతాపరుద్రునిమంత్రు లనియుఁ జెప్పచున్నారు గాని, కాకతీయ సామ్రాజ్యమునకు సంబంధించిన చరిత్రగంథములందు మాచూచినంతలో శరభాంకుని పేరు గాన "రాదు , , , , , “ఛాటుపద్యమణిమంజరిలో ఈశ తకమునందలిపద్యము లుదాహరిపఁబడినవి. ఆపద్యము లీశతకమునం దించు కేని వూర్పు లేకయున్నవి. ఉదాహృతపద్యములవలన శరభాంకలింగ వతకము లోకోత్తరముగా నుండునని భాంతిపడితిమి. గాని భాషా విషయిక దోషములు శతక మునిండఁ గలవు. విషయము కొన్ని పద్యములలో సకమముగా నిముడ లేదు. శబ్దలోపములుగూడఁ గలవు. కొన్ని పద్యములు మనోహరము లగు భావములతో* నిర్దుష్టముగా నున్నవి. ఇందలిపద్యములు రెండు తెగలుగా విభజించినచో సీరసములు భాషా దుష్టము లగుపద్యములు కొన్నియు, సరసములు నిర్దుష్టములు నగు పద్యములు కొన్నియు లభింపఁ గలవు. శతకమునందలియు _త్తరార్థము నందలిపద్యములు పూర్వార్ధమునందలిపద్యములకం ఒఁ బ్రౌఢముగా రసవంతముగా నున్నవి. భిన్నపతులు పరిశీలించితిమి గాని విపుల భేదములు గల పాఠాంతరములు కనిపింప లేదు. కారణ వూరయ నగును.” విశ్వేశ్వర దేశికలు శ్రీవత్సగోతుఁ డని తలంపుఁబడు చున్నది. శరభాంకుఁడు కౌశిక గోతుఁడు. కావున వీరిరువురు సోద రులు కాను. శరభాంకుఁడు కీ. శ. ౧:)?ం వ సంవత్సరమునకుఁ బూర్వు డనువూట నిశ్చయము, శతకమునందలి శైలినిబట్టి పదు నాల్గవశతాబ్దికవులలో జేర్చితిని. ఈతని కవిత్వశైలి తెలియుటకై శతకమునుండి నాల్గుపద్యముల నుదాహరించుచున్నాఁడను. చ కలలకుఁ జింతయేల తనకడ్డమువచ్చిన పిల్లి కోసమై యలమట యేల తుమ్మెనని యాపద యేల యనేక కీడులే దొలఁగక కంటిమంచు మది దోచక నిల్చి కృశింపనేల పో