పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ 0 ధక వి త ర ం గి శి 155 రామరాస్త్రలవారి యభిప్రాయము. చింతామణి నెఱింగినవారగు టచే వారికట్లు స్ఫురించినది. కాని యాగంథము నెఱుంగని వారం దఱును భారతరచనము వలన నే యూబిడుదవూతనికి లభించినదనితలం చియుండిరి. శబ్దశాసనుఁడనని నిన్నయ వ్రాసికొనెను గదాయని తరువాతివా రంధప్రాయము నాశబ్దమును వాడియున్నా రని తలంపరాదు. భారతమునందలి ప్రయోగములనుబట్టియు శబ్దరూపము లనుబట్టియు నాతఁడు శబ్దములను సంస్కరించి భావకు వన్నె దెచ్చె నని భావించి యూతనిని శబ్దానుశాసనుఁడని పొగడియున్నారని తలంపవలసియున్నది. చింతామణిచే సాధింపఁజాలని ప్రయోగముల "కాతఁడు శబ్దానుశాసనుఁ డగునా ? "కాఁజాలడా ! ముమ్మాటికి నగును. అందుకనియే విపులశబ్దశాసనుఁ డనని చెప్పకొనినాడు. ఒక నిమిషము చింతామణిమాట మఱచిపొండు. అప్పడు సన్నయకు శబ్దానుశాసనబిరుద ముండునా ! పోవునా ! భారత శబ్ద ప్రయోగము లనుబట్టి రసూతుని శబ్దానుశాసనుఁ డనఁగూడదా ! చింతామణి నన్నయకృతమనుట కీశబ్ద మొక్కించుక సాక్యమైనఁ గావచ్చును గాని, దీని నాధానముచేసికొని చింతామణికర్త నన్నయయని స్థా రణము చేయరాదనియు, భారతమువలన నన్నయకు శబ్దశాసనబిరు దము వచ్చిన దని తలంచుటలో దోషము లేదనియు నాయభి ప్రాయము.