పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

116 පදාඤ కవి తరంగిణి సంశయము కలుగుచున్నది. కాని యింతమాత్రముచేఁ ూలసరికి శబ్దము గ్రామనామ మేగాని గృహనామము కాదని నిర్ధారణము చేయుటకు వీలు లేదు, ఈవిషయమునఁ జరితకారులింకను బరిశిధింప వలసియున్నదని నాయభిపాయము. నిజాము రాష్ట్రమున 2רנas6י כדיס త్రక విషయములలో నెక్కువ పరిశోధనలు సలిపిన శేషాద్రిరమణ కవులీతఁడు కౌండిన్యసగోత్రులగు ఉత్తమ రాజు వారను నియోగి బాహ|్మణవంశమున జనించినవాడనియు, శిఖాయజ్ఞోపవీతములను విడనాడి జంగములలోఁగలిసిపోయి నట్లాయుత్తమ రాజవంశీయుల వలన వింటిమనియు వ్రాసియున్నారు. ఆఱు నందల సంవత్సరముల కిందట జరిగిన యీవిషయము నిప్పటి వారు చెప్పెడి నూటలనుబట్టి నిర్ణయించితి మేని యందుఁ బ్రవూదము గలుగవచ్చును కావున నీ విషయ మిదమిర్థమని నిర్ణయింప వీలు లేవు. భావిపరిశోధకుల కుపక రించునను నుద్దేశముతో 窓。 వాక్యముల నింగుఁ జేర్చితిని. -: ఇతిని కులము : ఇఁక నీసోమనాథుని కుల కాలములను గూర్చి చర్చింపవలసి యున్నది. ఈవిషయమున ననేక పత్రికలలోను గ్రంథపీఠికలలోను గంథములలోను పలుమారులు చర్చలు జరిగియున్నవి. అందు ముఖ్యపాత్రమును గైకొనిన వాగు శ్రీబండారు తమ్మయ్యగారు. సోమనాథుఁడు బాహృణుఁడు గాఁడనియు జంగముఁడనియు నతఁడు మొదటి పతాపరుదుని కాలములోను, గణపతిదేవుని కాలము లోను నున్న వాఁడనియు నాయన వాదము. బ్ర. శ్రీ. వేటూరి ప్రభాకర శాస్త్రలు వారు సోమనాథుఁడు వేదవేదాంగ విదుఁడైన బాహ్మణుఁడనియు, U့သေး (8. కాశీనాథుని నాగేశ్వరరావుపంతులు గారీతఁడా రాధ్య బ్రాహ్మణుఁ డనియు వాసియున్నారు. కాలవిష యమున వీరు మువ్వురు నేకాభిప్రాయులైరి. కాని బ. శీ). వుల్లంపల్లి సోమశేఖర శర్మగారును, చిలుకూరి నారాయణరావుపంతులుగారును