పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4–40.] ప శు ప తి నా గ నాc భు డు 157 ఈ శాసన కాలము క్రీ. శ. ౧3EF సంవత్సరమయినది. కావున నీకవి యానాటివాఁడని స్పష్టమగుచున్నది. పై శాసనమును శ్రీనాథ కవి చారిత్రమున నిచ్చెదను. ఈ నాగనాథకవి, మదనవిలాస మను భాణమును సంస్కృతమున రచియించి ఆున పో "తానా యునికిఁ గృతి యిచ్చెను. చమత్కా_రమంజరి' యనురసాలంకార సాహిత్యల్బణ గంధమును రచియించిన విశ్వేశ్వర కవిచంద్రున కీతఁడు శిష్యుఁడు. -ఈ గురుశిష్యు లిరువురు ననపోతానాయని యాస్థానము నలaరించి యున్న వారు. పైశాసనమునుబట్టి యీనాగనాథ కవి పదునాల్గవ శతాబ్దియం దుత్తదార్ధమున నున్న వాఁ డనుట నిశ్చయము. విష్ణుపురాణము నా O థీకరించిన వారిలో సీతఁడే మొదటివాఁడు. ఈతని గ్రంథము లభింప కపోవుట యాంధ్రులదురదృష్టము. అనపోతానాయఁడు, నైజామురా ష్ట్రమందలి రాచకొండ రాజ్యమును బరిపాలించిన వెలమ నాయకుడు. కావున నీకవియు నాప్రాంతములయందు శీనాథపోతనార్యులకుఁబూ ర్వమున సున్న వాఁ డని చెప్పటకు సంశయింపనక్క-ఆలేదు. ఈతని తండ్రి పశుపతిపండితుఁడు. ఈతఁడింకను గొన్ని సంస్కృతాంధ్సగం థములు రచించియుండును. కాని వాని పేరులయిసను దొరకలేదు. సింహాసన ద్వాతింశకను రచించిన STబ్రవిని*ప రాజు పూర్వ కవిస్తుతిని జేయుచు:-- చ. అనఘు హుళక్కి-భాస్కరు మహామతిఁ బిల్లలమఱ్ఱ వీర రా జును ఫును నాగరాజుఁ గవిసోమునిఁ దిక్కనసోమయాజింగే తన కవి, రంగనాథు నుచితజ్ఞని నెజ్జన నాచి రాజు సో మున నమరేశ్వరుం దలఁతు మత్కు-లచంద్రుల సత్కవీంద్రులన్, అని చెప్పియున్నాఁడు, ఇందలినాగరాజు పశుపతినాగనాథుఁడైయుం గునని బ. $) నిడదవోలు వేంకట రావుగారు వాయుచున్నారు. అది 1త్యమేయని తోఁ చుచున్నది. ఆ కాలమున నాగనాథుఁ డను పేరుగల