పుట:శ్రీసూర్య శతకము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమృతభోక్తలగు దేవతలకు, క్రియాగుణములు లేకయే డిత్తుడు - డవిత్తుడు అను నామములు కేవలము సాంకేతికములు మాత్రమే యగుచున్నవి కాని, దేవతల నామములలో గుణములను, సార్థకము చేయు నామము గలవా డొక్క సూర్య భగవానుడే. ఆతడు మిమ్మ నెల్లప్పుడు రక్షించుగాక.[99]

చ. చుట్టము పక్కముం గురువు చూపును గావును జ్ఞాతి జ్యోతియుస్
పట్టగు ప్రాణదాతయును భ్రాతయు తల్లియుఁ దండ్రియున్ సదా
పెట్టనికోటయై సకల పృథ్వికి నన్నము నీళ్లు నిచ్చుచున్
దిట్టపు వెల్గులం దనరు దేవుఁడు మీకిడు వాంఛితంబులన్.

తా. దైవమో, గురుడో, తండ్రియో, స్నేహితుడో, చుట్టమో, కనువెలుగో, రక్షక్షడో యని పరిపరి విధములుగా నేవని సర్వజనులు భావింతురో, అట్టి సర్వాకాలోపకారి యగు సూర్యుడు మిమ్మును నిరంతరము బ్రోచుగాక.[100]

చ. నలుబదిమూఁట, నాఱిఁ ట, గనం బది రెంటనుఁ బద్నకొంట బెం
వలరఁగ నెన్మిదింట, నిరు పంక్తుల తేజము వాజులున్ హయ
మ్ముల నదలించువాని రథమున్ ఘనబింబము సూర్యదేవునిన్
దెలియగ నమ్మయూరుఁడు నుతించిన శ్లోకళతమ్ము మీరగున్.

చ. పొలుపుగఁజేసె లోకహితబుద్ధి మయూరుఁడు సూఱుల్లోకముల్
చెలువగు భ క్తితోఁ బఠన చేసిన పుణ్యుఁడు ముక్తపాపుఁడై
బలధిషణాయువుల్ చదువు భాగ్యము సత్కవితార్థ పుత్రభా
క్కలన నరోగతామహిమఁగాంచును సూర్యుననుగ్రహంబునన్.

తా. మయూరుడను కవి భక్తి పరశచే రచించిన యీసూర్యస్తోత్రము నూఱు శ్లోకములను నెవరు ప్రతినిత్యము పఠింతురో, వారికి ఆరోగ్యము, కవిత్వము,