పుట:శ్రీసూర్య శతకము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జిక్కఁడు దేశకాలముల చేతికి వానిన లోఁగొనున్ సదా
యిక్కతనం ద్రిలోకహితుఁ డౌ నుతుఁ డా తపనుండు మీకగున్.

తా. ఒక ద్వీపమున నెండ కాయుచుండగా, మఱియొక ద్వీపమున వెన్నెల కాయుచుండును. దేశ కాలములు సంధ్యాద్యవస్థా విశేషములు, ఎవనికి వశమైనవో, ఎవుడు తన పాలనా సామర్థ్యముచేత లోకమునకంతకు హితము గావించునో అట్టి సూర్యుడు మీ కహరహము శోభనల నొసగును.[97]

ఉ. వ్యగ్రము లగ్యసుగ్రహభహారిగురుల్' సముదగ్రలీలఁ బ్ర
త్యగ్రము లీషదుగ్రములు నౌ నురుగోవుల గోవు గౌరతా
భాగ్రతిఁ బ్రాగ్గిరి న్నిలచి ప్రాచీ సరాగసురాగగా, దినం
బగ్రమునందుఁ జేసెడి గ్రహాగ్రణి మీ కగు నగ్రగస్థితిన్.

తా. ప్రాతశ్శైలమున నుదయించి, వడివడిగా లోకముల నెల్ల పర్యటించుచు, చంద్రాది గ్రహములను వెలవెల బాఱజేయుచు, మేరుగిరి శిలలకు పసుపువన్నె నాపాదించుచు జగచ్ఛ్రేయము గలిగించి, ఎవ డేకైకముగా వెలుగొందుచున్నాడో, అట్టి గ్రహరాజగు సూర్యుడు ఘోరమగు మీ పాపములను రూపుమాపుత.[98]

ఉ. వేదగురుండు పద్మజుఁడు విష్ణుఁ డజేయుఁడు శూలి శంభుఁడున్
శ్రీదుఁడు యక్షుఁ డయ్యముఁడు మృత్యువు పావకుఁ డగ్నిమంచు డి
ద్ధాదిపదంబు లట్లని సుధాంధులకుం బడెనంచు నామ మ
ర్యాదలు సార్థకంబుగఁ దనంత వహించిన ప్రొద్దు మీకగున్.

తా. సామవేదమున కుత్పత్తికారణము బ్రహ్మ - బ్రహ్మ, మధువైరి యగు విష్ణువు అజితుడు. జడముడి దాల్చిన మహాదేవుడు శంకరుడు. మృత్యువు కాలుడు. అలకాధిపతి ధనదుడు. జాతవేదుడు, పావకుడగు అగ్ని - అని యిట్ల