పుట:శ్రీసూర్య శతకము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇచట చిత్తరువు లేఖనమున్నది గాన దాని యుపకరణము తూలిక - కుంచె మూలమున తూలికా శబ్దమే యున్నది. గానీ కవిగారు "కలము" అని వాడినారు. ఇది సరికాదని పైకి తోచవచ్చును కాని సరియైనదే. తూలిక యనగా కలము అను నర్థము గలదు. (సూర్యరాయాంధ్ర నిఘంటువు 3వ సంపుటము పుట 924. తూలిక. సం వి. ఆ.స్త్రీ. నా చిత్తరు వ్రాసెడు కుంచె....3 వ్రాసెడు కలము.)

4. మూలశబ్దానుసరణము.

సూర్యశతకమునందలి మూలభావములను తాత్పర్య రూపమున తెలుగు చేయుటయేకాక నచ్చటచ్చట శబ్దానుసరణము గావించి యున్నారు. మూలమున వృత్యనుప్రాసము గల శ్లోకములు గలవు. ఈ యలంకారమును శ్రీరామకవిగారు పాటించియే యున్నారు.

వ్యగ్రైరగ్యగ్రహోడు గ్రసన గురుభరైర్నో సమగ్రై రుదగ్రై
ప్రత్యగై రీషదు గ్రై రుదయగిరిగతో గోగణై ర్గౌరయన్గామ్
ఉద్గాఢార్చి ర్విలీనామర నగర నగగ్రావ గర్భామివాహ్నా
మగ్రేయోగ్రే విధత్తే గ్లపయతు గహనం సగ్రహ గ్రామణీర్వః. 98శ్లో

వ్యగ్రము లగ్ర్య సుగ్రహ భహరి గురుల్ సముదగ్రలీలఁ బ్ర
త్యగ్రము లీషదుగ్రములు నౌ నురుగోవుల గోవుగౌరతా
భాగ్రతిఁ బ్రాగ్గిరి న్నిలిచి పాఱ్చి సరాగసురాగగాదినం
బగ్రమునందు జేసెడి గ్రహాగ్రణి మీకగు నగ్రగస్థితిస్.

5. ప్రసన్న రచన.

ఈ సూర్యశతకానువాద మంతయు ప్రసన్న రచన కుదాహరణమే. ఆయినను, మూలగంభీర భావములను తెనుగువారి కెంత సులభగ్రాహ్యమగునట్లు శ్రీరామకవిగారు రచియించినారో తెలుపుటకు మఱికొన్ని యుదాహరణములిచ్చుచున్నాను.