పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

267


క.

పరుఁడను గా దీనృపతికి
గురుఁడను నన లేచి భక్తి గూర్మి యెసంగన్
సరగునఁ బద్మావతి [1]యా
స్తరణము ముని కిచ్చి మ్రొక్కెఁ దాపసుఁ డంతన్.

239


తే.

వనజలోచన నీకు వివాహసిద్ధి
వేగ యగుఁగాత మంచు దీవించె రాజ
కన్యకామణి సంతోషకలిత యగుచు
నొదిగి సిగ్గున మాటాడకున్నఁ జూచి.

240


సీ.

ఆముని పల్కె నోయమ నామీఁద నీ
        కఱమఱ వలదు రమ్మనుచుఁ బిలిచి
కూర్చుండ నియమించి కూర్మిమాటలను హ
        స్తంబు చూపు మనంగ నంబుజాస్య
పల్కె నిట్లని మునిప్రవర నాతండ్రివి
        యనుచు హస్తంబు నాతనికి సాచి
చూపఁగఁ జిఱునవ్వుఁ జూపు చాతాపసుం
        డనియె నీహస్తాబ్జమును గనంగ


తే.

శ్రీకరాంచితమైనట్టి రేఖ లలరి
యమ్మహాలక్ష్మిలక్షణా లన్ని చేతి
యందుఁ గన్పట్టుచున్నవి యైన నవియు
నమ్మరో విను చెప్పెద నవియు నిపుడు.

241


తే.

స్వస్తికము పద్మమును ఛత్రచామరాలు
యవకులిశమత్స్యశంఖరేఖాదిలాంఛ

  1. ఆస్తరణము = ఆసనము - ఎఱ్ఱకంబళి