పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము




ఆ సమయమ్మునందు సనకాదులు యోగ తపోవ్రతక్రియా
భ్యాస విశేషబోధముల బ్రహ్మ మెఱింగియు దేశికోక్తి న
బ్జాసన విష్ణురుద్రులు గుణాశ్రయులంచుఁ దలంచి నిర్గుణో
ద్భాసిత దక్షిణాభిముఖ దైవము జూడఁగ వెండికొండకున్.6


చనునెడ ముందట నఖండ పాండు డిండీరఖండాచ్చచ్ఛవిభాసురంబులును శరత్కాల కాదంబినీ కదంబక ప్రభాడంబర విడంబితంబులు నగు మహా కలధౌత శిఖరిశిఖరంబుల విలోకించి నమస్కరించి డగ్గరి య గ్గిరీంద్రంబు నకు జుట్టునుంగల గణేశ వీరభద్ర నంది భైరవ కుమార దుర్గా మహాకాల మహాదన్తాభిరక్షి తాష్టదిగ్గోపురద్వారంబగు ప్రాకారం బతిక్రమించి కాంచ నాంచితభూభాగంబగు ప్రథమావరణంబున భక్తులగు ననేక దేవర్షిబ్రహ్మర్షి సిద్ధసాధ్యగణంబుల నాలోకింపుచు నేకోత్తరశతకోటి రజితశిఖర విరాజితం బగు ద్వితీయావరణంబున త్రైలోక్యముక్తులగు నసంఖ్యాత ప్రమథుల వీక్షింపుచు నేకోత్తరకోటి సువర్ణశిఖరాకలితంబగు తృతీయావరణంబున ననేకకోటి రుద్ర రుద్రకన్యా ద్యష్టైశ్వర్యసిద్ధవితానంబులంజూచుచు నేకో త్తరలక్ష లక్షిత మణిశిఖరాలంకృతంబగు చతుర్థావరణంబున స్వాధికారం బులు వదలి మోక్షాపేక్షులై జ్యోతిర్లింగంబు ధ్యానంబుసేయు ప్రాచీన విధి విష్ణుపురందరాది బృందారక సందోహంబు నీక్షింపుచు నేకోత్తరదశసహస్ర స్ఫటికశిఖరాభిరామంబగు పంచమావరణంబున ఋషభ క్షేత్రపాల చండీశ దుర్గా స్కంద నంది గణేశ సైన్యపతుల సామీప్యముక్తుల నవలోకింపుచు నేకోత్తర సహస్ర సూర్యకాంత శిఖరోత్తుంగంబగు షష్ఠావరణంబున నేకోత్తరశత తాండవమూర్తులను సారూప్యముక్తులనుం గనుంగొనుచు నేకోత్తరశతాగ్నికాండశిఖరోదారంబగు సప్తమావరణంబున పరమేశ్వరు పంచవింశతి లీలాస్వరూపంబుల నుతింపుచు నేకాదశ చంద్రకాంత శిఖ రాభిశోభితంబయిన యష్టమావరణంబున నేకాదశరుద్రమూర్తులకు నమస్క రింపుచు నవరత్నమయైక శిఖరమయంబగు నవమావరణంబున సాయుజ్య