పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/195

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

156

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


లైన నఱికిన దద్దోష మధిక మగుచు
బ్రహ్మహత్యా సహస్రమై పరగుచుండు
నమ్మహాస్థల మహిమంబు నరయవశమె
ధాతకైనను కుండలి నేఁతకైన. 327


ఆశ్వాసాంతముభూరాజ ద్రధ మేరుకార్ముక మహాభూతాధినాథా మహా
ఘోరాఘస్మృతి పృష్ఠభాగ చరణా గోరాజ రాజధ్వజా
సారోదార భుజాగ్రశూల హతరక్షస్సంగ గంగాధరా
గౌరీనాయక చంద్రచూడ త్రిజగత్కల్యాణ సంధాయకా ! 328

మునిజన హృదయాంభోరుహ
వనజాప్తాకార వేద వర్ణిత చరితా
జననాంత దూర చిన్మయ
మనసిజ మదహరణ భక్త మంగళకరణా ! 329

మాలిని:

జలధికృతనిషంగా జహ్ను కన్యానుషంగా
కలికలుష వినాశా గర్వితారాతినాశా
బలభిదుపల కంఠా భక్త లోకోపకంఠా
విలసదమలబోధా విశ్వలోకైకనాథా ! ! 330

ఇది శ్రీమద్దక్షీణామూర్తి కటాక్షవీక్షాసంప్రాప్తోభయభాషా కవిత్వ వైభవ సచ్చిదానందాఖండస్వరూస రాజయోగానందానుభవ శ్రీమదుత్తర శైవసిద్ధాంత ప్రబోధిత షట్‌స్థ్సలాధ్వానుగత పరమ శివై క్యానందానందిత మనీషా విశేష ప్రభావ సకల విద్యానిధాన కొప్పరాజనంతార్యపౌత్ర లింగన ప్రధానపుత్ర సుజనవిధేయ నృసింహనామధేయ ప్రణీతంబైన చిదంబర నటన తంత్రోక్త శ్రీమత్త్రికోటీశ్వర స్థలపురాణంబను మహాప్రబంధమునందు సర్వమ్మునుం దృతీయాశ్వాసము సంపూర్ణము.