Jump to content

పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

155

కాలంబున నధిష్ఠానంబగు బ్రహ్మంబే నిలిచినట్టు లీ నగేంద్ర సన్నిధి శివరాత్రి కాలంబున ననేక విచిత్రోత్సవం బేర్పడి మఱునాఁ డేమియు లేక యిన్నగం బొక్కటియ నిల్చు టాశ్చర్యంబని యంచు బ్రహ్మవిన్ని కాయంబును, చిత్రకూట స్నానంబున సితాసిత పీతారుణ ప్రభావిభవం బేర్పడుట సహజంబె కావున నీ త్రికూట స్నానంబునందును సితాసిత పీతారుణ ప్రభావం బేర్పడెనని యంచు యోగి నికురంబంబును, దేవతా వాసంబున నానావిధ భోగంబులు గల్గు టుచితంబగుట నీ దేవతావాసంబు నందును నానావిధ భోగంబులు గల్గెనని తలంచు కర్మర సమూహంబును నిత్య సుమనోమోదమంజు లతారూఢ నిలయంబుల సకల విషయ పదార్థానుభవ సుఖంబులం దృప్తిగాంచిన ట్లచ్చట నిత్య సుమనోమోదమంజు లతారూఢ నిలయంబుల సకల విషయ పదార్థానుభవ సుఖంబులం దృష్తి గాంచి క్రీడించు భక్త నికరంబుమ న్గల్గి యమ్మహోత్సవం బవాజ్మానస గోచరంబై పరమానందంబు నొందించు నెంతయు. 325


గుడిచుట్టుఁ బూల తోఁటలు
కడువేడుక నిల్పిరేని కై లాసమునన్‌
దడవు వసింతురు శంకరు
కడఁ బ్రమథులఁ గూడి భోగకలితాకృతులై. 326

గుడిచుట్టు దమకుఁ దా నెడనెడ మొలిచిన
             మారేడు చెట్టులు క్రూరు లగుచు
నఱికిన దుర్జనుల్‌ నష్టాత్ములై ఘోర
             నరకకూపంబుల బొరలుచుందు
రిహమందు దారిద్ర్య మేచఁగా బహుళాప
            దల బొంది మూఢులై పొలియుచుందు
రటులౌట కోటీశ్వరాలయ ప్రాంతంబు
            నందు బిల్వతరులు నన్యతరువు