Jump to content

పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము

నా ప్రభానిచయంబునందుఁ గొన్ని తార హార హీర తార తారాచలాఖండ లోద్దండ వేదండ డిండీరఖండ శ్రీఖండాభ చ్ఛవిబంధురంబులును, కొన్ని రసాలపల్లవ హల్లక తరుణారుణ ఘుసృణ మసృణ భాసురంబులును, కొన్ని తప్తకాంచన ప్రసూనోదంచిత హరిద్రాక్షుద్రభద్రద్యుతివితాన వితతంబులును, కొన్ని విచిత్రచ్ఛాయాడంబరాంబర ప్రభాచ్ఛాదన కిమ్మీర వర్ణంబులును, కొన్ని విచిత్ర పుష్పపల్లవాలంకృతంబులును, కొన్ని స్వసంవృత పటవిచిత్రిత నంది భృంగిరిటోమామహేశ్వరలింగ బ్రహ్మ విష్ణ్వాది సర్వసుపర్వవిగ్రహంబులునున్తై కోటీశ్వరాలయ ప్రదక్షిణంబున కరుగునెడ నెడనెడ భూతి రుద్రాక్షమాలాలంకృతదేహులై ప్రమథగణంబులంబోలు గణంబులు కోటీశ్వరధ్యానలీనమానసులై జనంబులు మ్రొక్కు మ్రొక్కుబడుల లోపంబుల దేహతాపంబులు జనింపఁ దదీశ్వరప్రేరిత వాక్యంబులఁ దదుపద్రవ శాంతిగాఁగ నంతనంత సంగీత వాద్య నృత్యంబులు సెలంగ సోపానమార్గమధ్యాభీరకాంతా గృహంబునకుంఁ బ్రదక్షిణంబు గావించుచు దక్షిణలొసంగి కోటీశ్వరాలయ ప్రాంతంబున కేఁగి ప్రదక్షిణ త్రయం బొనరించి తద్దేవున కభిముఖంబుగా నిల్చునెడ గణంబులు సేయుచు నానందపరవశులై భజింప మ్రొక్కులు చెల్లించి మరల నేతెంచు సమయంబున యాచకగణంబులు సోపానతలంబున దేవతాగణంబుల భజింపుచు వచ్చు గణంబుల యెదుట నిలిచి వినుతింపఁ గోటీశ్వరాలయంబునకుఁ బ్రదక్షిణార్థం బరుగుదెంచు ప్రభానిచయంబునకు మార్గంబియ్య నోరసిల్లుచుండు నెడ విశాలస్థలంబుల విశ్రమింపుచు, తత్పర్వతాథస్థిత వనాంత రంబులకుం జేరియుండు నింక జనంబు లెక్కు టెట్లనిన- 279


చేదుకో కోటప్ప చేదుకో కోటప్ప
             చేదుకో కోటప్ప చేదుకొనుము
అను వాక్యములు మింటనంటఁగా సోపాన
             పటలి, నెక్కుటఁ బుట్టు బడలికలను
శీతలచ్ఛాయా విశేష భూషితములౌ
             తరుమూలములయందుఁ దనర నిలిచి