పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము




మందు వల్లవకాంత కగపడ న య్యింతి
              వ్రతముజేసినను తద్వ్రతసమాప్తి
సేయఁగాఁ దద్గృహసీమకు నక్కాంత
              తోఁగూడ నఱుగ నీత్రోవయందు

పరశివై క్యంబుఁ బ్రాపించెఁ బడఁతి యిప్పు
డేను నీ గుహాంతరమున నిల్వగోరి
నాఁడ గుహమీఁద గుడిగట్టి నయమెలర్ప
నందులో నూత్నకోటీశు నమర నిల్పు. 157

నిల్పి నీవును నిత్యంబు నియతిఁ దనర
బూజఁగావించి శివరాత్రిపూట భక్తిఁ
బ్రభలఁ గట్టించి వీరాంగ వాదనంబు
నెలఁగ నుత్సవమెంతయుఁ జేయవలయు. 158

కాంత సోపాన మధ్యమార్గంబునందు
ఘనసమాధిని శివునందుఁ గలిసె నిచట
నీవు గుడిఁగట్టి యందులో నిలుపు తత్స్వ
రూప మొక్క ప్రతిమ జేసి రూఢిదనర. 159

మును సోపానసథంబున
జనుదెంచెడి వారలెల్ల సద్భక్తిని నా
వనజాక్షిఁజూచి యంతట
ఘనమతిఁ గోటీశుఁ జూడఁగల్గు శుభంబుల్‌. 160

ఇట్లు కోటీశ్వర పూజా విధానంబుఁ జేయుచు నంత త్రిలోకోత్సవావసరంబగు శివరాత్రి వాసరం బరుదెంచిన నాసాలంకుం డుషః కాలంబున నోంకార నదీ జలంబుల స్నానం బొనర్చి భస్మోద్ధూళన త్రిపుండ్రంబులు ధరియించి


  • గమనిక : ఇచ్చటనుండి అసలుప్రతిలో నొక కాగితము పోయినది.