తృతీయాశ్వాసము
119
తన కుదయించి ముందటఁ గనపట్టు శిశు వదృశ్యంబగుటయు, తనదు కన్యాత్వంబుఁ జెడకుండుటయు, దనకు దేహాయాసంబు లేకుండుటయు, జూచి యంతయు మామకదైర్య పరీక్షార్ధం బమ్మహాత్ముండు చేసిన మాయా ప్రభావంబనియు నీ జంగమమూ ర్తి సాక్షాత్కోటీశ్వరుండెయనియు నెఱింగి, తనకుఁ బ్రారబ్ధ కర్మక్షయంబగుటకు సంతసించి విదేహముక్తి నొంద దలంచి తన మనంబున నిట్లని వితర్కించె. 151
దేహమందున బ్రహ్మాండ గేహమందు
బ్రహ్మమంతటఁ బూర్ణమై బరగుచుంట
సద్గురుండగు నిమ్మహాసంయమీంద్రు
కరుణచేఁగాక యొండు సంగతిని గలదె ! 152
అని విచారించి 153
అంతటఁ దత్ప్రసాదమున నాత్మసమాధినిఁ జెంది చిత్త వి
శ్రాంతి వహించి, యా సతి విరాజితచిద్గగనస్వరూపయై
యంతయుఁ దానె యౌచును శివైక్యతఁ జెందిన మౌనిచంద్రుఁడున్
స్వాంతమునందు సంతసిలి శైలగుహాంగణభూమి నిల్చినన్. 154
అంతట 155
నిత్య మా భీరకాంత దా నియతి వచ్చు
కాల మేగిన రాకున్న గడువిచార
మంది సాలంకుఁ డజ శిఖరాగ్రమెక్కి
యందు గుహపొంతనున్న య య్యతినిఁ గాంచి. 156
సాష్టాంగ మెఱిఁగిన సంయమి యిట్లను
సాలంక : మున్నొక్క సమయమందు
నీకు దర్శనమిచ్చి నే నంత నంతర్హి
తుండ నై రుద్రాఖ్యఁ దొడరు శిఖర