పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుండెను. శివుఁడు 'భిక్షుకుఁడు, శ్మశానవాసి, నీచుఁడు, గౌరవహీనుఁ డనియు, తాము కైలాసమున కేఁగినప్పు డమర్యాద గానించెననియు పరమ శివద్వేషియై వానిని బిలువకయే యజ్ఞమొకటి చేయ సంకల్పించి ప్రారంభించేను. బ్రహ్మాది దేవతలు, మహర్ష్యాదులు వచ్చిరి. నారదుఁ దావార్త శివున కెఱింగింప సతి, పతి వలదన్నను వినక గణపతితో నచ్చటికేఁగి స్వజనముచే నవమానితయై 'తండ్రీ : ఏ సంబంధమగు తనపు విడుతును. నీకనర్థకమగుఁగాక' యని కాలి బొటనవ్రేలి గోట నేలరాయుడు యజ్ఞకుండమునఁబడి మాయమై పర్వతరాజునకుఁ గూతురై పుట్టెను. శివుఁడు దానినంతను దివ్యదృష్టి నెఱిఁగి కోపించి చెమటనూడ్చి శిలపై జల్లెను. తోడనే ప్రళయకాల రుద్రాకృతితో వీరభద్రుఁ డుద్భవించి తండ్రియానతిఁ జని దక్షాధ్వరవాటమునఁ గలవారినెల్ల చిత్రవిచిత్రముగ హింసించి దక్షునిబట్టి శిరము ఖండించి హోమమొనర్చి యజ్ఞధ్వంస మొనర్చెను. వెంటనే దక్షునిసతి పతిభిక్షకోరి ప్రార్థించినఁ దలవంపులగునట్లు గొఱ్ఱెతలయుంచి బ్రతికించి వీర భద్రుఁడు శివునిజేరెను. పిదవ శంకరుఁడు శాంతమూర్తియై తాను బండ్రెండేండ్ల బాలుఁడుగ మాఱి బ్రహ్మచర్యమువ కైలాసంబున సప్తమావరణంబున సమాధి నిష్ఠుఁడై యుండెను.


రుద్రశిఖరము :


అయ్యెడ సనకసనందవాది బ్రహ్మర్షి సంఘంబుకు, బ్రహ్మాది దేవతలును. వాలఖిల్యాది యోగసిద్ధులు నా దక్షిణామూర్తిని జేరి మ్రొక్క తమకు బ్రహ్మోవ దేశముఁ జేయ వేఁడిరి. అతఁ డందుల కంగీకరించి యెల్లరఁ దోడ్కొని చని త్రికూటాద్రికి వచ్చి విల్చెను. ఆ ప్రదేశమే ప్రాతకోటీశ్వరుని బోడు, రుద్ర శిఖరము. అందు శివుఁడు బిల్వవనాంతరమున బ్రహ్మాసనాసీనుఁడై యోగనిష్ఠుఁడై పర్వులకు మౌనముద్రచే బ్రహ్మోపదేశ మొనర్చెను. ఇయ్యది వటువగు దక్షిణామూర్తిక్షేత్ర మగుటచే కల్యాణోత్సవమును, ధ్వజము నీ ప్రదేశమున లేవు.

విష్ణు శిఖరము :

రుద్ర శిఖరమునకుఁ బ్రక్కనున్న శిఖరమున విష్ణుదేవుఁడు శివుని గూర్చి తపము సల్పి శివుని బ్రవన్నుని గా ఎంచుకొనేను. తోడనే దేవేంద్రాదు లచ్చటికి వచ్చి తాము దక్షాధ్వరంబున హవిర్భక్షణము సలిపిన దోషంబు దొలఁగునట్లు. లింగ రూపమున నందు నిత్యము దర్శవంతీయఁ బ్రార్థించిరి. శిపుఁ డప్పుడు చేతి త్రిశూ