పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


అనిన నెయ్యంపుఁదల్లికి గారాబు కూతు రిట్లనియె. 91

అమ్మ యిం దుండు భోగ భాగ్యంబులెల్లఁ
జెడును గూడంగ రావెందుఁ జెడదు శంభు
భక్తి కూడంగ వచ్చును ముక్తి నొసఁగు
దీని విడనాడ వచ్చునే మానవులకు? 92

శివభక్తి కలుగు మీఁదట
నవిరళ సద్భోగభాగ్య మబ్బినమేలౌ
ధవుఁడున్న మీఁద నింతికి
నవభూషణ స్రగ్విలేపనంబులువోలేన్ ,93

లోని నిక్షేపమెఱుఁగక దానిమీఁద
నిలిచి సంసారమొనరించు నిస్వునట్ల
హృదయగతుఁడైన యీశ్వరు నెఱుఁగలేక
బాహ్యమున నీళ్లు వెదకును పామరుండు.94

జననీ : మనము కోటీశ్వర స్థలములోన
నుండి యద్దేవు గొల్వకయుండఁ దగునే ?
తుచ్ఛసంసార విషయ సందోహములను
మరగి యురగేంద్ర భూషణు మఱవఁదగునె?95

కామముఖారులం గెలిచి గాఢవిరక్తిని శంభుభక్తుఁడై
కామవిదారిఁ గొల్చినను గల్గును మోక్షసుఖంబు లిప్పుడే
కాముకుఁడై దురింద్రియ వికారములంబడి శంభుఁ గొల్చినం
గామసుఖంబులం దనిసి కాంచును దాఁ గ్రమముక్తి నెంతయున్ .96

గరిమతో భోగమోక్షముల్ గలుగఁజేయు
నిహపరంబుల శివభక్తి యేమి చెప్ప