పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పడి యంతటి తిరునాళ్ళు జరుగుటకుఁ గల కారణ మచ్చటి విప్రోత్తముల నడిగి, వారెఱుఁగ మన మఱునాఁడింటికి ప్రయాణమై వచ్చుచుండెను. త్రోవలో శ్రీశైల ప్రాంత వాసియైన ముదిగొండ కేదారలింగమను ఆరాధ్య బ్రాహ్మణుఁ డెదురుపడెను. కవి యా విప్రునికి నమస్కరించి తన కోర్కె వెల్లడించెను. తోడనే యాతడు "ఇది శివుఁడు దక్షిణామూర్త్యవతారంబునఁ బండ్రెండేండ్ల వటుఁడై సమస్త బ్రహ్మర్షి దేవర్షులకు బ్రహ్మోపదేశ మొనర్చిన పుణ్యక్షేత్రము. ఈ విషయము చిదంబర నటన తంత్రమునఁ గలదు, సంపాదించి చూడుఁడు. బహు ప్రసిద్ధ మైనది" అనివెడలిపోయెను. అంతఁ గవి దాని నెట్లో సంతరించి శ్రీ దక్షిణామూర్తి స్వామికిఁ గృతిగ మూఁడాశ్వాసముల పద్యకావ్యమును వ్రాసెను. ఇందు కథాభాగ మతిస్వల్పము. భక్తి స్తోత్రాదులు, వర్ణనలు విస్తారముగ వ్రాయఁబడెను. ఈయన వేదాంతకవి. పరమ భక్తుఁడు, ఉభయభాషాభిజ్ఞుఁడు. శివపూజా ధురంధరుఁడు. తపస్సంపన్నుడు. శిష్యపరంపరలో నీయన కిప్పటికి నారాధన సాగుచున్నదని చెప్పుదురు. నరసింహకవి కొందఱు శిష్యులతో శ్రీ కోటీశ్వరుని సన్నిధానమున నుండి కోవెల బాగుచేయించునప్పు డొకనాఁ డాయన ప్రా౦తకోటయ్య గుడియొద్దఁ గల పానవట్టమును విష్ణు శిఖరమందున్న పాపవినాశనస్వామి గుడికి తేఁదలంచి శిష్యులతోమ కూలివాండ్రతోమ ప్రయత్నించుచుండెనట. అచ్చటికొక రెడ్డి వచ్చి 'మీరందఱకవైపున, నే నొక్కఁడ నొకవైపున నెత్తుకొని పోవుద'మని వారినొప్పించి యెత్త నతనివైపు భారములేవ వారు తమ యసమర్థతకుఁ జింతించి మఱునాఁటికి వాయిదా వేసిరి. ప్రక్షకుఁబోయి రెడ్డి మాయమయ్యెనఁటు ఎల్లరు నాఁటి రాత్రి కోటీశ్వరాలయమున నిద్రించుచుండఁగా నర్ధరాత్రివేళ నరసింగయ్యగారు వెలు పలికివచ్చి యెవరితోనో రహప్యాలాపము లాడుచుండుట పబ్బతి గురవయ్య యను శిష్యుఁడెఱింగి లేచి మెల్లన బైటికేఁగి, యావలనున్న వ్యక్తిని గానక మఱలివచ్చి వరుండి తెల్లవాఱినపిదప విషయమడుగఁగా గురులు "నాయనా! ఆదిదేవరహస్యము, నీవెఱుఁగఁజాలవు. పానవట్టమును గుడియొద్దకుఁ జేర్చితినని యొక దివ్యపురుషుఁడు చెప్పిపోయె" నవీరఁట. ఆ పిమ్మట నరసింగయ్యగారు తన కార్యక్రమమును నెఱవేర్చుకొని ధన్యులయిరని చెప్పుదురు. ఈ చరిత్రమెంతయు ప్రశంసనీయము. లోకమున మహాత్ములశ క్తిని కొలుచుటకు సాధనములేదుగదా :

ఈ కవి యితర గ్రంథములు (1) మహాకవులెవ్వరుఁ దలపెట్టవీ సూత.. సంహిత నీ మహాకవి యాంధ్రీకరించెను. దీనిని కీ. శే. బ్ర. శ్రీ జానపాటి