4
మొదటి మూడు వర్ణములవారు అన్న శ్రాద్ధమే చేయవలసినది. భార్యలేనివాడు, ప్రవాసి, వ్యసనము కలవాడు ఆమశ్రాద్ధము చేయవచ్చును. నాల్గవవర్ణమువారు మాత్రము సర్వదా ఆమము చేయవలెను,
4.ద్విజులలో అపత్తులయందైనను తద్దినము, సపిండము గయా శ్రాద్ధము, మహాలయము ఇవి ఆమముచేత జరిగించకూడదు.
ఇందునకుబ్రమాణములు,
నిర్ణయసింధువు తృతీయ పరిచ్ఛేదము - శ్రాద్ధనిర్ణయము
స్మృతిదర్పణము
మృతాహంచ సపిండంచ,గయాశ్రాద్ధము, మహాలయం
ఆపన్నో పిన కుర్వీత శ్రాద్ధమామేనకర్హి చిత్
తద్దినము, సపిండము, గయాశ్రాద్ధము, మహాలయము, ఇవి ఆపత్తునందైనను ఆమముచేత పెట్టరాదు. అని యిందు చెప్పబడింది. తద్దినములనుటచే మాసికములు కూడ గ్రహించదగినది, పరాశర మాధవీయమును చూడుము. ౧2౫ పుట
శ్రాద్ధవిఘ్నే ద్విజాతీనా | ఆమశ్రాద్ధం ప్రకీర్తితం|
అమావాస్యాదినియతం మాససాంవత్సరాదృతే|
5.ద్విజులలో తద్దినము, మాసికములు, సపిండము, గయశ్రాద్ధము మహాలయము ఇవి అన్నముతోనే జరిగించవలసినది.
అందునకు బ్రమాణములు.