పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఓ సత్పురుషులారా!

ప్రకృతమునందు వైశ్యకులమువారు మృతాహస్సులయందన్న శ్రాద్ధము సేయరాదనియు, ఆమ శ్రాద్ధము జరిగించ వలసిన దనియు, వైశ్యులలో వైశ్యులు భోక్తలుగా నుండవలసివచ్చును గాన నట్లు భోక్తలుగా వైశ్యులుండుట పనికి రాదనియు, భోక్తలు ప్రతిగ్రహీతలు కావలసివచ్చును గాన ప్రతి గ్రహణము సుతరాం వైశ్యులకుఁ గూడదనియు, పరిషత్కాల మంత్రములు మొదలగు వానిలో బ్రాహ్మణులే కొనియాడ బడినారుగాన అట్టి బ్రాహ్మణత్వము వైశ్యులకు అసంభవమనియు బందరు మొదలగు స్థలములయందు అనేకులగు బ్రాహ్మణులు దుర్వాదములు సేయుచున్న సంగతి యందరికి విశదమే. ఈ యంశములలో శాస్త్రజ్ఞానము లేనివారికి బ్రాహ్మణులు సేయు దుర్వాదము సత్యమే యని తోచవచ్చును. కాని అది భ్రాంతి. కొంచము ఓపికతో ఈ చిన్న పుస్తకమును చదువుడు. ఇందులో సుదాహరింప బడిన ధర్మశాస్త్రములను తెప్పించి చూచి అర్ధ జ్ఞానముకలవారివలన వాని యర్ధమును వినుండు. మీకు సంశయము విడుచును. తరు వాత శ్రాద్ధ విషయములో వైశ్యులకును బ్రాహ్మణులకును లేశము భేదము లేదని తెలియును. ఈ యంశమును ఇదివరకు నేనురచించి ప్రకటించియున్న