పుట:శృంగారశాకుంతలము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

55

     కొన నిది యవసరంబని మ్రానిచాఁటు విడిచి జవనిక వాయందట్టినం
     [1]బొడసూపు బహురూపి తెఱుంగున మఱుంగుపడియున్న తా నన్నలి
     వి[2]లోచనలకుం గోచరుండై నిలిచి వెఱవకుం దోడకుండు తపస్వికన్య
     లకు మీకు నాకులం బొనర్చిన దుశ్చరిత్రుఁ డెవ్వండు వాని నాజ్ఞాపించెద
     ననిన సుధామధురంబులగు నతని వాక్యంబు [3]లాకర్ణించి కనుంగొను
     నెడ.78
సీ. కస్తూరివ్రాసినకరణి మీసలు నల్లదొగడురేకు
                    జనించు మొగము మెఱయఁ
     గ్రొత్తమ్మిసోగఱేకులమీఁదఁ దుమ్మెద
                    లున్నలాగునఁ బెద్దకన్ను లమర
     నాజానుదీర్ఘంబులైన బాహులపెంపు
                    శేషభోగాకృతిఁ జెలువ మొందఁ
     బిడికిలింపగవచ్చు నడిమి యొప్పిదముతో
                    నురమువిస్తారంబు సిరి వహింప
తే. నాననము పూర్ణచంద్రుపెం పపహసింప
     గగనమున నుండి వేడ్క నకాండ మిలకు
     నదరిపాటుగ డిగిన జయంతుఁ డనఁగఁ
     జాల నద్భుత మొసఁగె దుష్యంతమూర్తి.79
వ. ఇట్లు పొడచూపిన నృపాలచంద్రు నాకారతేజోవిశేషంబులు భావించి
     జయంతుఁడో కంతుఁడో నలకూబరుండో యిచ్చటికి వచ్చుట కెయ్యది
     కారణంబకో యని యద్భుతంబును జయంబును మనంబునం బెనగఁ
     గొండొకవడి గనుంగొని నరుండకా నిశ్చయించి యతని కులనామధే
     యంబు తెలిసికొనవలెనని యనసూయాప్రియంవదలు రాజువదనార
     విందం బాలోకించి.80
ఉ. ఎక్కడివాఁడ వన్న జగతీశ్వరలక్షణలక్షితంబు నీ
     చక్కనిమేను దీర్ఘభుజశాఖలుఁ దేజముఁ జర్చ సేయఁగా

  1. బొడకట్టు
  2. లోచనగోచరుండై
  3. లాలకించి