పుట:శృంగారశాకుంతలము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

29

     మృగము చేరఁగవచ్చు మొగసిరి చూర్ణంపు
                    దిలకంబు లలికసీమల ఘటించి
     వాకట్టు వదినికె చేకట్టు మండలు
                    కరకాండమధ్యభాగములు దొడగి
     కుఱుచగాఁ గట్టిన కరక దట్టీదిండు
                    నంతరమ్మునఁ బిడియాలు దోపి
తే. పందిపోట్లును దడవిండ్లుఁ బాఱవాతి
     యమ్ములును జిల్లకోలలు నడిదములును
     వలతి యీటెలు ధరియించి వచ్చి రంగ
     రక్షకులు లేతతరముల ప్రాఁతవారు.113
క. అరిగెలు నిష్ఠురబాహాపరిఘలు
     ధరియించి నగరిపాలురు నేతెం
     చిరి శిఖపటుజిహ్వాసమ
     కరవాలద్యుతులు గగనకాలిమ గడుగన్.114
శా. సింగంపుంబొది వచ్చు చందమున వచ్చెం బోయకాలారి యు
     త్తుంగశ్యామలదేహసంజనితకాంతు ల్వీరలక్ష్మీనవా
     పాంగచ్ఛాయలతోడఁ బెల్లొదవి మ్రోయ [1]న్వేల్లదుద్యద్భుజా
     సంగత్వంగదభంగభంగురధనుర్జ్యావల్లరీఝల్లరుల్.115
గీ. ఉరులు జిగురుగండె దెరలును బోనులు
     వారువారెసలును వనులు గనులు
     [2]మిళ్ళువలలు పేట్లు గోళ్ళు దీమంబులు
     నాదిగాగ దెచ్చి రాటవికులు.116
వ. మఱియును మూలభృత్యబలంబును, సామంత[3]కుమారవర్గంబును నర్హ
     ప్రకారంబుల సముచితాలంకారులు, సాయుధులు, సవాహనులునై చను

  1. న్యలదుద్య
  2. i. మళ్లు, ii. వేళ్లు;
  3. మంత్రివర్గంబు