పుట:శృంగారశాకుంతలము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

శృంగారశాకుంతలము

     ముఖసమర్పితహాటకఖలీనములతోడఁ
                    గాంచనగ్రైవేయకములతోడ
     సమకట్టి ముడిచిన చామరంబులతోడఁ
                    దాఁపఁబెట్టిన యడిదములతోడ
     కనకఘంటలయురుగజ్జెపేరులతోడఁ
                    గర్ణకీలితదీర్ఘకళలతోడ
తే. జిత్రమున వ్రాయఁగారాని చెలువుతోడ
     నొప్పి యుచ్చైశ్శ్రవముతోడి యుద్దులనఁగ
     వాహకులు దేఱవచ్చె దుర్వారలీల
     వసుమతీనాయకుని పూజవారువములు.111
సీ. [1]వలనంబు పుట్టించి వంకంబు లొలయించి
                    డిల్లాయి ప్రకటించి ఠేవ చూపి
     వరసంబు నొందించి [2]పల్లంబు కలిపెంచి
                    నిగుడంబు సమకొల్పి నెఱను నెఱపి
     లవిగూర్చి లవిదేర్చి లాగిచ్చి శుండాల
                    ముల నోజవట్టించి ఖలువు దెచ్చి
     లవణి సంకోచంబులకుఁ దెచ్చి హవణితో
                    రససిద్ధి వడయించి రాగెలందు
తే. నాఱుతానకములను గృత్యమ్ము లేడు
     నరువదే నాసనంబుల నెఱిగి హరుఁల
     నెక్కు రసికులు వచ్చిరి హెచ్చునగరి
     రాగరవుతులు సమరానురాగమతులు.112
సీ. జడ లల్లి ముడిచి పాగడఁ జొళ్ళెములు
                    దీర్చి తలముళ్లు బలువుగా నెలవుకొల్పి

  1. వరసంబు
  2. వల్లంబు