పుట:శృంగారశాకుంతలము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ii

ప్రాశస్త్యమును గూర్చి వివరించు సుమారు 40 పేజీల పీఠికను చేర్చ వలెనని నిశ్చయించనై నది. ప్రతి సంపుటము వెల ఒక రూపాయి మాత్రమే. ఈ విధముగా యీ సంపుటాలన్నిటిని సుమారు 5 సంవత్సరముల కాలములో ముద్రించి ప్రకటించవలెనని అకాడమీ కార్య వర్గము తీర్మానించినది.

మేము కోరినంతనే ఈ సంపుటము సిద్ధముచేయు బాధ్యతను స్వీకరించి, నిర్ణయించిన గడువులోపల వ్రాత ప్రతిని మాకార్యాలయానికి అంద జేసిన శ్రీమతి నాయని కృష్ణకుమారిగారికి అకాడమీ పక్షాన కృతజ్ఞతలు.

పైన పేర్కొనిన 50 సంపుటాల వ్రాత ప్రతులను సిద్ధము చేసి ముద్రించుటకు, అవసరమైన డబ్బును పూర్తిగా అకాడమీకి యిచ్చుటకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వాగ్దానము గావించి యిందులో కొంత డబ్బును విడుదలకూడ చేసినవి. ఇందుకు అకాడమీపక్షాన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు. అనుకొనిన వ్యవధిలో సంపుటాలను సిద్ధముచేసి, ఆంధ్రపాఠకలోకానికి అందజేయుట జరుగగలదని విశ్వసించుచున్నాము.

హైదరాబాదు,

15.5.1967.

దేవులపల్లి రామానుజరావు,

కార్యదర్శి