పుట:శృంగారశాకుంతలము.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

75

తే. చపలలోచన మొగముతో [1]సరియవచ్చు
     నింతిపాలిండ్లదోయితో నీడువచ్చు
     వనితయూరుద్వయంబుతో [2]నెనయవచ్చుఁ
     జంద్రముఖిపాదయుగముతో సవతు వచ్చు.174
వ. అని మఱియు నాపాదశిరోరుహాంతంబు వర్ణించు నుత్కంఠ నారాజకంఠీర
     వుండు మాండవ్య యొండు తలంపులేక విను మని యి ట్లనియె.175
సీ. వెడవిల్తుచిగురాకుగొడుగులు గొని వచ్చి
                    చరణద్వయంబుగా సవదరించి
     సంకల్పసంభవు జయకాహళుల దెచ్చి
                    జంఘాయుగంబుగా సంఘటించి
     దుగ్ధాబ్ధిమనుమని తూణీరములు దెచ్చి
                    యూరుయుగంబుగా నుపచరించి
     శ్రీదేవిసుతు హేమసింహాసనము దెచ్చి
                    జఘనచక్రంబుగా సంతరించి
తే. నీరరుహసూతిశేషాంగనిర్మితికిని
     దగినయవి లేక కంకపత్రమున నిచట
     గడమ కలదని వ్రాయు లేఖయును లిపియు
     మధ్యమును నాఱు నయ్యె నమ్మానవతికి.176
సీ. ప్రసవాస్త్రమాయావి బైల వ్రాసిన సుడి
                    బిసరుహాననకు గంభీరనాభి
     మోహచూర్ణము వోసి మూసిన బంగారుబరిణె
                    లుత్పలగంధిగురుకుచములు
     యౌవనామరభూరుహమున డిగ్గిన యూడ
                    లరవిందవననకు గరయుగంబు
     సౌందర్యజలధిలో సంభవించిన పాంచ
                    జన్యంబు మీనలోచనగళంబు

  1. సరికివచ్చు
  2. నెనకువచ్చు