పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

462 శుకసప్తతి

సామ్రాజ్యవైభవశాశ్వితుఁ డయ్యును
జనకుఁ డత్యంతసుజ్ఞానదీప్తి
గీ. యతులితోత్సాహవిదితమై యలరునట్టి
మహిమ వెలయు సద్భక్తసామంతశాలి
వగుచు వైరాజ్యవంతుఁడవై సమస్త
రాజ్య మేలగదయ్య యోరాజవర్య! 348

గద్యము. ఇది శ్రీమత్ఖాదిరీనృసింహకరుణాకటాక్షవీక్షణసమాగతకవితాధారపాలవేకరికులకలశాంభోనిధిసుధాకర తాడిగోళ్లకరియమాణిక్యనృపహర్యక్షపౌత్ర పవిత్రచరిత్ర కదురధరామండలాఖండలపుత్ర విద్వత్కవిరక్షణానుసంధాయక కదిరీపతినాయక ప్రణీతంబయిన శుకసప్తతియను మహాప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము సర్వము సంపూర్ణము.