పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 437

దోడ్కొని పాండ్యమహీమండలాఖండలు సముఖంబునకు నరిగె. యో ప్రభావతీ! యవ్వసుమతీపతి యేగతి తదీయవివాదం బుడుపవలయు నిది యెఱుంగకున్న ననన్యసామాన్యుండగు రాజన్యమూర్ధన్యుపాలికింబోవ నూహింతువే తెలుపు మని పలికిన యంకురితమనఃస్సంకోచన యగునప్పంకజాక్షి నీరీక్షించి యప్పక్షికులాధ్యక్షుం డిట్లనియె. 228

క. మగువా! తిర్యక్కులజుం
డగుట న్నుతిలేక మించనాడితి నేరం
బగు సైరించుట భవదీ
యగుణంబుగదా శమించి యవ్వలవినుమా! 229

క. ఆపాండ్యనృపతి విప్రా
లాపంబులు హితునిమాటలున్ విని నరుగన్
ప్రాపితముఖుఁడై కరుణా
శ్రీపటిమన్ బచ్చువాని చేరన్ బిలిచెన్. 230

క. పిలిచి చెవులోన నేమో
పలికిన నతం డలరుమొగము భాసిల్లగ రా
జులదేవ యనుచు ధరణీ
తలనాయకుఁ బొగడి జనితదరహాసమునన్. 231

గీ. బ్రాహ్మణులఁ బిలచి నాయింటఁ బదిలపరచి
యున్నయది విత్తమెల్ల నాయొద్ద ననుచు
నపుడు మీచిన్నగతి నేఁగు రరుగుదెంచి
యడుగుఁ డిచ్చెద మాఱుమాటాడవలదు. 232

క. అన వారు మొగమొగంబులు
కనుగొనుచు న్నిలువ ధరణికాంతుఁడు కరుణా