పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

496 శుకసప్తతి

ఉ. ఇచ్చుటయున్ విధేయుఁడు సుదీప్సితముల్ ఫలియించె నంచు లో
హెచ్చినసంభ్రమం బురల నెప్పటినల్గురిగూడి కొంతద
వ్వచ్చెడురీతి వెంటఁజని యంతట వారల కన్మొఱంగి తా
నిచ్ఛకువచ్చుతావునకు నేఁగె మహాజవ ముప్పతిల్లగన్. 224

ఉ. అంతట వానిగాన కపు డంపిననాలుగువేలరొక్క మా
ద్యంతము దెచ్చెనో జరిగెనోయని మిత్రముఖుల్ దలంచి య
త్యంతరయంబునన్ మఱలి యాహితునింటికిఁ బోయి మాధనం
బంతయు నిమ్మటన్న విని యాతఁడు వారలఁ జూచి నవ్వుచున్. 225

సీ. అపుడు మీ రంపఁగా వచ్చినట్టియతని
చేతికే మీఱ లిమ్మని సెలవొసంగ
ధన మొసంగుట యెఱుఁగనిదారి బలుక
దగునె యీసుద్దు లెల్లవర్తకులతోడ. 226

గీ. అనిన వారు రొక్కమంతయుఁ దెమ్మని
యనుప లే దనంగ నతఁడు మీర
లిమనంగ విత్త మిచ్చితినొ లేదొ
యస్య పెద్దమాట లయ్యె నపుడు. 227

వ. తదీయవాక్యోపవాక్యంబు లాకర్ణించి యందంద సందడిగా మూఁగిన యాధార్మికులు గొంద ఱిఱుదెఱంగులవారి వారించి మహీసురోత్తములు విత్తంబంతయుఁ బోనాడుకొని పోదురె యనియును, హితుండు ఘంటికామంత్రంబు తనయింట నునుచికొనుట కాని లాభంబుగానని వాఁ డర్థంబంతయు నిచ్చునే యనియుం దలపోసి చెడినసొమ్ము చెరిసగంబుగా వగదెంచి యాబచ్చువానిం బిలిచి వీరు నీయధీనంబు బెట్టినధనంబునం దొక్కపా లిమ్మనిన సమ్మతించక యతండు నలువురిం