పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

346 శుకసప్తతి

గొని ప్రసంగవశజనితంబు లగు రాజకార్యంబులం బక్షాపరపక్షంబులు వహించి పోరాడుగ్రామీణుల నిరర్థప్రయాసంబునకుం దరహాసంబు సేయుచు దధితగ్రవిక్రయంబు లుపదేశమాత్రంబులుగా జారాన్వేషణంబులు ప్రధానకార్యంబులుగా సమీపజనపదంబులనుండి వచ్చియున్న యాభీరభీరువులపరిభాషలభావం బెఱింగి యంతరంగంబులుం గరంగి మార్గశ్రమంబును దినావసానప్రపాస్థలదూరంబులును విచారింపక తదానీతులై సంకేతలతాగృహంబుల కరుగుకుమారపాంథుల వయోమదాంధత్వంబుఁ దిలకించి యించువిలుకాని యకాలశౌర్యనిర్వహణంబునకు మెచ్చుచు నత్తైర్థికుండు పూర్వరాత్రంబునఁ బ్రయోజనవశంబున జాగరూకుండై యుండుటం జేసి శయనించి నిద్రాముద్రితనేత్రుండై యుండునంత. 450

తే. తత్ప్రపాంతరజనుల సంతాపదశల
పాలుపఱుపని తనప్రతాపంబు రోసి
కొంచెపఱిచెనొ రవినాఁగఁ గోష్ణమయ్యె
నతులయామశయానాంతరాతపములు. 451

తే, అప్పుడచ్చటఁ గూడిన యధ్వగాళి
చనియె నిర్దిష్టనగరవిశ్రాంతి నొంద
బ్రొద్దు గ్రుంకినఁ బిళ్లారిపూజ సేయు
బ్రాహ్మణుండును జెంగటిపల్లె కరిగె. 452

ఉ. అంతట మేలుకాంచి వసుధామరవర్యుఁ డనార్యనిర్గత
ధ్వాంతము నధ్వనీనరహితత్వముఁ జూచి దిగు ల్జనింప లో
నెంతయుఁ జింతనొంది తెరు వెక్కడనో కనఁగూడ దీడనే