పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

318 శుకసప్తతి

మామిడిచెట్టులం దొరంగు ఫలరసంబునం బదనైన ఠావునం బొదలి పాఱు పచేళిమభిదేళిమేక్షురసంబునకుఁ దోడు చూపు వేరుపనసపంటిరసంబుల కాలువలకు వింతలు గల్పించు నానాప్రసూనరసంబుల నిర్ఝరంబు లుభయపార్శ్వంబులం బొలుచు నితరనదీకదంబంబుల చక్కఁదనంబు నెక్కొలుప నిక్కువం బిక్కటిల్లు తమ నిబ్బరపు గుబ్బలకు సురాళింపఁబూనుకరణిం దాల్చు కనకకుంభంబులతో రంభాస్తంభంబులనడుమ వెడలి పోఁకమ్రాఁకుల నొరసికొని యాకుఁదోటలకుం గేడించి లికుచవనాంతరంబు ముందఱం గనం జెలువు మీఱ సప్తసముద్రంబు లేకీభవించిన తెఱంగున నంబుతత్త్వంబు సాక్షాత్కరించినవిధంబునఁ బ్రవాహవిజృంభణంబు చూచుచుండ నొక్కనాఁడు. 323

తే. మణిధరనామకుఁ డగు నొక
ఫణివరుఁ డవగడము కతనఁ బడి యన్నదిలో
గణనాతీతభయంబునం
దృణముం బలె ఝరమువెంటఁ దేలుచువచ్చెన్. 324

తే. వచ్చు నతనిఁ జూచి వఱద వెంబడినట్లు
భీతి నరుగు నొక్క భేకవిభుఁడు
కాష్ఠబుద్ధిమణివికాసితతత్ఫణా
గ్రంబు నెక్కి బ్రదుకఁ గంటి ననుచు. 325

క. ఘనతరతరంగఘట్టన
జనితవ్యథనిజఫణాగ్రసక్తుం డగునా
తని నెఱుఁగఁ డురగవరుఁడుం
జనియెం దరిఁ జేరలేక ఝరవేగమునన్. 326