పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 317

తే. నలరు మాతృమనీషాసమాగతేందు
కేళిదృఢబింబపాళికాకృతికదంబ
ఖేలనాలోలమదమిళచ్చోళబాలి
కాముఖస్తోమ యయ్యాపగాలలామ. 320

ఉ. ఇవ్వలి రేవులం దుమికి యీఁది తటాలున నీటివాలుగా
నవ్వలిగట్టుఁ జేరు ద్రవిడాంగన లంబురుహోత్పలంబులన్
దవ్వుగఁ ద్రోచు జడతగుఁ దన్నది జందెపువాటు గాఁగ మై
మవ్వపు నీలపు న్సరు లమర్చిన టెక్కున నక్కడక్కడన్. 321

క. అసమలసమానబిసరుహ
విసరలసద్ధూళి కలితవిభ్రమదావ
ర్తసముదయం బానదిలోఁ
బొసఁగుం జలనరుల గొడుగుబొమ్మరములనన్. 322

వ. వెండియు నఖండతరతీరాగ్రహారయాయుజూక నిరంతరప్రతిష్ఠిత సవనపవనసఖ ధూమస్తోమంబు లంబుధిభ్రమావలమాన జలపానవిలోలవలాహకంబులయందంబుఁ బొందు పఱప, నిరుపమానతపస్థైర్యస్థాపిత కాశాతిప్రకాశకుసుమంబులు పుణ్యనదీశ్రేష్ఠతాప్రతిపాద బిరుదచామరంబుల సింగారంబులం బొంగింప సముత్తుంగ చటచ్ఛటారావగౌరవాతిభీత నిజవధూజనసమాశ్వాసవచనముఖరపథికతరుణినికరంబు లుల్లసితవల్లభచర్యాస కాశాత్మ చర్యాత్మ దృతద్వీపకలాపంబుల విధంబునం జెలంగ నభంగ బాహాప్లవనపరాయణజనోత్తమాంగ వలయితధవళవసనంబులు విహారసమాయాతస్రోతవ్యాళకంచుక సమంచితకుండలీకృత భోగంబుల సోయగంబునం గనుపట్ట నీరుగట్టున నెట్టుకొను తియ్య