పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 313

నెఱమంటలం గనుంగొని దూతికావచనంబునం బానీయశాలాగతుండైన జారుండును నిజమందిరావనపరుండై క్రమ్మఱియె నంత. 302

ఉ. పాలికనిర్జనాదిభయభావము దూరము చేసి వాసియౌ
బాళి జనింప నేగి చలిపందిటి ముందట నన్యభీతిచే
నాలుగుదిక్కు లారసి ఘనంబగుచీఁకటి కందరంబునుం
బోలు తదంతరాళతలము న్వడిఁ జేరి మహారిరంసయై. 303

క. అచ్చట జారుని గానక
య చ్చెలి యుచ్చలితమానసాంభోరుహయై
ఱిచ్చవడి తెచ్చుకోలగు
హెచ్చరిక న్మఱియు వాని నెల్లెడ నెమకన్. 304

తే. వెదకి కానక వాఁడు నాహృదయ మెఱుఁగ
వేడి దాఁగెనొ యని బహిర్వేదిఁ జూచి
యెచట లే డెందొ యరిగినాఁ డేమొ యనుచు
నరిగి పందిటిలో నెల్ల నరసి పొగిలి. 305

శా. ఏరా మారునిబారికారియనున న్నిట్లేతురాతాళఁగాఁ
లేరా నేరము లేఱి దూఱక దయాలీలం గటాక్షింపరా
మేరా గారవ మారఁగా రతిసమున్మేషంబు లీకుండుటల్
రారా కూరిమిమీఱఁ జేరి కయికోరా జారవీరాగ్రణీ. 306

తే. ఇప్పు డాయిందువచ్చు టిదేమి యనుచుఁ
గోపమున డాఁగితేమొ మద్గురుజనంబు
కనుమొఱంగుట కొకనేర్పుఁ గాంచఁగోరి
యుంటి నేరంబు సైరించు టుచిత మిపుడు. 307