పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

312 శుకసప్తతి

వెరవు గానక పాలికాతరళనయన
యాత్మలోనన యొకయుపాయంబు నెంచి. 299

క. ఇది సేయరా దటంచు
న్మది నెఱిఁగియుఁ దహతహన్ రమాతనయు వశం
వదయగుటం బానుపు డిగి
పదయుగళము సద్దడంచి భయవిరహితయై. 300

తే. చని యధిశ్రయణిని వహ్ని సంగ్రహించి
యింటి నడికొప్పతగిలించి యెఱుఁగనట్లు
ముంగిటికిఁబోయి రొదగాఁగ మొఱలువెట్ట
నదరిపడి లేచి గృహదహ మనుచు బెదరి. 301

వ. శిశురక్షణంబునకుం బశురజ్జుమోక్షణంబునకుం గృహోపకరణసంగ్రహంబునకు, దస్కరనిగ్రహంబునకుం బాల్పడి గురుజనంబు లేమఱిన సందడిం బడి యప్పడంతి బుడిబుడినడలతో నగరరక్షకాధిక్షేపదక్షంబగు సాహసంబు సహాయంబుగా సమయస్థలసరణిం గైకొని చన నంతఁ బావకుండునుం బవమానప్రవర్ధమానుండై నిలయాధారవేణువిదళజనితచిటచిటధ్వానంబు లాపోశనమంత్రోచ్చారణంబుగాఁ దైలఘృతాదికంబు లెడనెడం బానీయంబులుగా నయ్యగారం బాహారంబుగాఁ గొనియుం దనివిసనక పూర్వకృతఖాండవదాహం బుదాహరించు తెఱంగునం బ్రతివిశాఖాతిప్రతాపంబుఁ జూపుటవలన ధనంజయాభిధానంబునుం బుష్కరోజ్జృంభణవిధానంబు వలనం బృహద్భానునామంబును గృతార్థత్వంబుగా విహరింపఁ దొడంగె నంతకమున్న పౌరజనకోలాహలంబులతో జంటయై మింటి కెగయు